సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' మూవీ జనవరి 10న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. అవన్నీ చూశాక ఈ మూవీ శంకర్ మార్క్ తో గ్రాండియర్ గానూ చరణ్ స్టైల్ లో ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది.
అయితే ఈ సినిమాలో సాంగ్స్ కి శంకర్ స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఒక్కో పాటను ఒక్కో స్టైల్ లో డిజైన్ చేశారు. కేవలం సాంగ్స్ కోసమే రూ.75 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు ఇటీవల డీలా రాజు కూడా చెప్పారు. దీన్ని బట్టి రేపు సినిమాలో సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి స్పెషల్ అప్లాజ్ వచ్చే ఛాన్స్ ఉంది.
"Everything changes and looks dreamy in love" - @shankarshanmugh sir about the idea behind #NaanaaHyraanaa | #Lyraanaa | #JaanaHairaanSa 💜
— Game Changer (@GameChangerOffl) November 25, 2024
A @MusicThaman Melody! ❤️
Choreography: @BoscoMartis 🕺🏼
Lyrics: ✍🏼 @ramjowrites,@Lyricist_Vivek #KausarMunir#GameChanger pic.twitter.com/QmYDSuxZM6
అయితే శంకర్ ఇప్పటిదాకా ఎవరూ వాడని టెక్నాలజీని వినియోగించారట. ఈ సాంగ్ ను ఇన్ఫ్రారెడ్ కెమెరాతో షూట్ చేశారట. ఆ కెమెరాతో తీసిన ఫస్ట్ ఇండియన్ సాంగ్ కూడా ఇదే కావడం విశేషం. దీన్ని బట్టి చూస్తే 'గేమ్ ఛేంజర్' కోసం డైరెక్టర్ శంకర్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు అర్థమవుతుంది.
ఈయన గత చిత్రం 'ఇండియన్ 2' బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. దాంతో మెగా ఫ్యాన్స్ 'గేమ్ ఛేంజర్' రిజల్ట్ విషయంలో కాస్త భయపడుతున్నారు. కానీ ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే.. ఈసారి పక్క కమర్షియల్ ఎలివెంట్స్ తో పాటూ ఆయన మార్క్ కనిపించేలా సోషల్ మెసేజ్ కూడా స్ట్రాంగ్ గా ఇవ్వబోతున్నారని స్పష్టమవుతోంది.
Also Read : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్