Gaddar Awards: జూన్ 14న గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం.. జ్యురీ చైర్ పర్సన్ గా జయసుధ

ఈరోజు జరిగిన గద్దర్ అవార్డుల మీడియా సమావేశంలో.. జూన్ 14న అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని ఎఫ్ డీసీ ఛైర్మెన్ దిల్ రాజు తెలిపారు. ఈ అవార్డుల కోసం వివిధ కేటగిరీల నుంచి 1248 నామినేషన్లు వచ్చాయి. జ్యురీ కమిటీ చైర్ పర్సన్ గా జయసుధ ఎంపికయ్యారు.

New Update
gaddar awards held on june 14th

gaddar awards held on june 14th

Gaddar Awards:  తెలంగాణ విప్లవ కవి గద్దర్ నివాళిగా.. తెలంగాణ ప్రభుత్వం గతేడాది 'గద్దర్ అవార్డులను' ప్రకటించింది. గతంలో నంది అవార్డు పేరుతో ఉన్న ఈ పురస్కారాలను ఆయన గుర్తుగా  'గద్దర్ అవార్డులకు' మార్చారు. అయితే ఈరోజు గద్దర్ అవార్డులకు సంబంధించి మీడియా సమేవేశం ఏర్పాటు చేయగా.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్ డీసీ ఛైర్మెన్ దిల్ రాజ్, సీనియర్ నటి జయసుధ తదితరులు హాజరయ్యారు. 

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ.. విప్లవ కవి గద్దర్ తన పాటలతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. ఆయన పేరుతో అవార్డులు ప్రదానం చేయడం ఎంతో ఆనందకరమని అన్నారు. 14 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ లో జరగబోతున్న ఈ చలన చిత్ర వేడుకను ఘనంగా నిర్వహించాలని.. అందుకు కావాల్సిన సహాయ సహకారాలు ప్రభత్వం నుంచి అందిస్తామని తెలిపారు. 

జూన్ 14న అవార్డుల ప్రధానోత్సవం

అలాగే ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ  'గద్దర్ అవార్డుల' నిర్వహణ, కమిటీ సభ్యుల గురించి  కీలక విషయాలు వెల్లడించారు. జూన్ 14న అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని తెలిపారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇస్తున్న ఈ అవార్డుల ఎంపిక కోసం 15 మందితో కూడిన జ్యురీ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జ్యురీ కమిటీ చైర్ పర్సన్ గా సీనియర్ నటి జయసుధ ఎంపికైనట్లు తెలిపారు. 

 మొత్తం కేటగిరీల్లో కలిపి 1248 నామినేషన్లు రాగా.. వ్యక్తిగత 1172 నామినేషన్స్ వచ్చాయని తెలిపారు. అలాగే ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్ తదితర విభాగాల్లో 76 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుతం జ్యురీ సభ్యులు అవార్డుల ఎంపిక కోసం నామినేషన్లు పరిశీలిస్తున్నారని తెలిపారు. 

telugu-news | cinema-news | latest-news | gaddar-awards

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు