Singer Madhu Priya: చెల్లి పెళ్ళిలో డాన్సుతో అదరగొట్టిన సింగర్ మధుప్రియ.. వీడియోలు, ఫొటోలు చూశారా!

టాలీవుడ్ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆమె చెల్లి శృతి ప్రియ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మధు ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది.

New Update
folk singer madhu priya at sister wedding

folk singer madhu priya at sister wedding

Singer Madhu Priya: టాలీవుడ్ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి భాజాలు మోగాయి. ఆమె చెల్లి శృతి ప్రియ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మధు ప్రియా తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో షేర్ చేసుకుంది. శృతి ప్రియ సుమంత్ పటేల్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో  పలువురు ఫోక్ సింగర్స్, సినీ సెలెబ్రెటీలు, సోహాల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సుర్స్  సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

మధుప్రియ పెళ్లి సందడి.. 

చెల్లి పెళ్ళిలో మధుప్రియ ఎనర్జిటిక్ గా డాన్సులు వేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. బరాత్, హల్దీ, మెహందీ, సంగీత్ ఈవెంట్లలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి డాన్స్ వేసి ఫుల్ సందడి చేసింది. చెల్లి శృతిప్రియ ఎంగేజ్మెంట్ నుంచి వివాహం వరకు అన్ని పనులను తానే దగ్గరుండి చూసుకుంది మధుప్రియ. మధు ప్రియా చెల్లి పెళ్ళిలో ఫోక్ సింగర్ కనకవ్వ కూడా సందడి చేసింది. అంతేకాదు పెళ్ళిలో  లైవ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది కనకవ్వ. 

తెలంగాణకు చెందిన మధుప్రియ పదేళ్ల వయసు నుంచే పాటలు పాడడం మొదలు పెట్టింది. మొదటగా ఆమె పాడిన  'ఆడపిల్లనమ్మా' పాట  మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఈ పాటతో  ఒక్కసారిగా ఫుల్ పాపులరైన మధుప్రియ అటు తెలంగాణ ఫోక్ సాంగ్స్ , ఇటు సినిమా పాటలు పాడుతూ కెరీర్ లో ఫుల్ బిజీగా ఉంది. ఫిదా సినిమాలో   'వచ్చిందే పిల్లా మెల్లిగా వచ్చిండే ', సరిలేరు నీకెవ్వరూ లో 'ఈజ్ సో క్యూట్',  బంగార్రాజు సినిమాలో 'బంగార బంగార' రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాంలో  'గోదారి గట్టుమీద'   వంటి సూపర్ హిట్ పాటలతో ప్రేక్షకులను అలరించింది.  టచ్ చేసి చూడు, నేల టికెట్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా పలు సినిమాల్లోనూ తన వాయిస్ తో ఆకట్టుకుంది. 

సింగర్ రమణ గోగుల,  మధుప్రియ కలిసి పాడిన ఈ పాటకు సూపర్ హిట్ రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో 161  మిలియన్ పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. మధు ప్రియ కెరీర్ లో మరో బిగ్గెస్ట్ చాట్ బస్టర్ గా నిలిచింది. సింగర్ రమణ గోగుల కూడా 14 ఏళ్ళ గ్యాప్ తర్వాత ఈ పాటతో మళ్ళీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. సినిమాల్లో మాత్రమే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది మధుప్రియ. తన చెల్లెలతో కలిస్ రీల్స్ , డాన్స్ వీడియోలు చేస్తూ పోస్ట్  చేస్తుంటుంది. 

Also Read: Nikesha Patel: పవన్ కళ్యాణ్ 'కొమరం పులి' హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూడండి! ఫొటోలు చూస్తే అంతే !

Advertisment
తాజా కథనాలు