Farah Khan : చిక్కుల్లో ఫరా ఖాన్ .. క్రిమినల్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే!

ఫరా ఖాన్ చిక్కుల్లో పడ్దారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. సెలబ్రిటీ మాస్టర్ చెఫ్ అనే రియాలిటీ షోకు ఆమె న్యాయనిర్ణేతగా వచ్చారు. ఇందులో ఆమెహోలీ పండుగ గురించి మాట్లాడుతూ వివాదాస్పద కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

New Update
Farah Khan

బాలీవుడ్ చిత్రనిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ చిక్కుల్లో పడ్దారు. ఆమెపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇంతకి ఏం జరిగిందంటే, ఫరా ఖాన్ 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్' అనే వంట రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వచ్చారు. ఇందులో ఫరా ఖాన్ హోలీ పండుగ గురించి మాట్లాడుతూ వివాదాస్పద కామెంట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

మతపరమైన మనోభావాలు దెబ్బతిశారంటూ ఫరా ఖాన్ పై న్యాయవాది అలీ కాశిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌లో  క్రిమినల్ కేసు నమోదైంది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు న్యాయవాది అలీ. 

హోలీ పండుగ గురించి మాట్లాడుతూ

ఫరా ఖాన్ 'సెలబ్రిటీ మాస్టర్ చెఫ్' ఎపిసోడ్ లో హోలీ పండుగ గురించి మాట్లాడుతూ... 'హోలీ అనేది చాప్రి పండుగని ఆమె అన్నారు. పవిత్ర పండుగను వర్ణించడానికి 'చాప్రి' అనే పదాన్ని ఉపయోగించడం చాలా అనుచితమని ఫిర్యాదుదారుడు వెల్లడించాడు.  చాప్రీ అంటే సంస్కృతిలేని మనుషులు అని అర్థం వస్తుందని ఆయన తెలిపారు. మతపరమైన మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా హిందూ సమాజాన్ని కూడా ఆమె అవమానించారని ఫిర్యాదులో తెలిపాడు.  ఈ విషయంలో ఫరా ఖాన్ పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. 

ఫరా ఖాన్ కామెంట్స్ సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. నెటిజన్లు ఆమెను వీపరితంగా ట్రోల్ చేస్తున్నారు. వెంటనే ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ఫరా ఖాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కొన్ని సంస్థలు కూడా ఫరా ప్రకటనను ఖండించాయి. ఇంతవరకు ఆమె దీనిపై రియాక్ట్ కాకపోవడం గమనార్హం.  

Also Read :  ఫాల్కన్ కేసు లోకి ఈడీ ఎంట్రీ..కేసు నమోదు

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు