/rtv/media/media_files/2025/06/16/06P3WJElrztQz9pcrgkc.jpg)
Fatima Sana Shaikh
Fatima Sana: నటి ఫాతిమా గతంలో సౌత్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తాను చేసిన వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఒక సంఘటనను పట్టుకొని ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదించడం సరైనది కాదని తెలిపారు. మొత్తం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని తాను తప్పుపట్టలేదని, అది కేవలం ఒక వ్యక్తి గురించి మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అనవసరంగా దీనిని పెద్దది చేశారని అన్నారు.
Also Read: Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!
ఫాతిమా కామెంట్స్!
ఫాతిమా ఇంకా మాట్లాడుతూ.. దురదృష్టవశాత్తు మహిళలు అనేక రంగాల్లో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కుంటుంది. ఒక మహిళ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే.. ఒక పురుషుడు ఆమెను వేధించవచ్చు లేదా అసభ్యంగా మాట్లాడవచ్చు. నేను దానిని ఎదుర్కొన్నాను.. ఇప్పుడు దాని నుంచి బయటపడ్డాను. కానీ, నా మాటలను ఎందుకు వక్రీకరించారో నాకు తెలియదు. అనవసరంగా దీనిని పెద్దది చేశారు అని వివరణ ఇచ్చారు నటి ఫాతిమా.
అసలు ఫాతిమా ఏమంది?
గతంలో ఫాతిమా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో ఒక సినిమా ఆడిషన్ కోసం వెళ్లగా.. అక్కడ ఓ దర్శకుడు తనతో అనుచితంగా ప్రవర్తించినట్లు తెలిపింది. ఇండైరెక్ట్ గా తనను ఏమీ చేయడానికైనా రెడీనా అని అడిగినట్లు ఫాతిమా ఆరోపించింది.
Also Read: Kuberaa Trailer: 'కుబేరా' ట్రైలర్ లో ఇదే హైలైట్.. ధనుష్- నాగ్ కాంబో అదిరింది!