Little Hearts OTT: 'లిటిల్ హార్ట్స్' OTT రిలీజ్‌పై ETV Win క్లారిటీ.. త్వరలో విడుదల.. (కాదు!)

లిటిల్ హార్ట్స్ సినిమాకు మంచి థియేట్రికల్ రన్ ఉన్నందున త్వరలో OTTలో రాదని ETV Win క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ OTT తేదీలను నమ్మొద్దని తెలిపింది. కలెక్షన్స్ రూ.40 కోట్లు దిశగా దూసుకెళ్తోంది. అధికారిక OTT డేట్ త్వరలో ప్రకటించనున్నారు.

New Update
Little Hearts OTT

Little Hearts OTT

Little Hearts OTT: మౌళి హీరోగా తాజాగా విడుదలై సూపర్ సక్సెస్ కొట్టిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తూ మంచి కలెక్షన్లు రాబడుతోంది. మౌళి తనుజ్ ప్రసాంత్, శివాని నాగరం జంటగా నటించిన ఈ చిత్రానికి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించారు. ‘మిరాయ్’, ‘కిష్కింధపురి’ వంటి సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, లిటిల్ హార్ట్స్ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే రూ. 40 కోట్ల మార్క్‌ దిశగా దూసుకెళ్తోంది.

ఈ సినిమాకు ETV Win డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో లిటిల్ హార్ట్స్ త్వరలో OTTలో విడుదల కాబోతుందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ETV Win అధికారికంగా స్పందిస్తూ, "లిటిల్ హార్ట్‌స్ ఇంకా థియేటర్లలో మంచి కలెక్షన్లు సాధిస్తోందని, ప్రస్తుతం OTTలో విడుదల చేసే ఆలోచన లేదని" స్పష్టం చేసింది.

Also Read: 'OG' సునామీ షురూ.. బుకింగ్స్ ఓపెన్.. రేట్లు ఎలా ఉన్నాయంటే..?

ఫేక్ అప్‌డేట్స్‌ ఆపండి..

మరి కొందరు సోషల్ మీడియా పేజీలు అఫిషియల్ సమాచారం లేకుండానే తప్పుడు వార్తలు షేర్ చేస్తుండటంపై, OTT టీమ్ సరదాగా స్పందిస్తూ "అటువంటి ఫేక్ అప్‌డేట్స్‌ను ఆపండి" అని కోరింది. నిజమైన OTT రిలీజ్ డేట్‌ను వారు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఇక ఈ సినిమా థియేటర్లలో నాలుగు వారాలు ఫుల్‌ రన్‌ చేస్తే, అది ట్రెండ్ సెట్టర్‌గా నిలవొచ్చు. ఎందుకంటే చాలా సినిమాలు మూడు వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వస్తుండగా, లిటిల్ హార్ట్‌స్ మాత్రం నెమ్మదిగా లాంగ్ రన్ ఆడుతోంది.

Also Read: టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద మాఫియా.. అల్లు అరవింద్‌ క్రెడిట్స్ కొట్టేస్తాడు: బండ్ల గణేష్

ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, జయ కృష్ణ, అనిత చౌదరి, ఎస్.ఎస్. కంచి, సత్య కృష్ణన్ కీలక పాత్రల్లో నటించారు. సంగీతాన్ని సింజిత్ యెర్రమిల్లి అందించగా, వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు.

మొత్తంగా, ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంటూ, డిజిటల్ రిలీజ్ ఇప్పట్లో చేయకూడదని డిసైడ్ అయ్యింది. ఈ సినిమాను హోమ్ స్క్రీన్‌పై చూడాలనుకుంటున్నవారు మాత్రం మరికొంత సమయం వేచిచూడాల్సిందే.

Advertisment
తాజా కథనాలు