మాకు ఇలా జరగడానికి కారణం ఆ డైరెక్టరే.. మేఘన స్టోరీ వింటే కన్నీళ్లు ఆగవు!

ఇంద్రనీల్, మేఘన దంపతులకు పెళ్ళై 20 ఏళ్ళు అయినప్పటికీ..  ఇంకా సంతానం కలగలేదు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు మేఘన. ఆమెకు గర్భస్రావం అవడానికి ప్రధాన కారణం డైరెక్టర్ అంటూ చెప్పుకొచ్చింది. పూర్తి స్టోరీ కోసం ఆర్టికల్ చదవండి

New Update
meghana

tv serial actress Meghana

Meghana Indraneel:  చక్రవాకం సీరియల్.. ఆ సీరియల్ లో నటించిన ఇంద్రనీల్, మేఘన ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటారు. తెరపై కలిసి నటించిన వీళ్ళు.. నిజజీవితంలోనూ ఒకటయ్యారు. చక్రవాకం సమయంలో ప్రేమలో పడిన ఈ జంట.. ఆ తర్వాత 2005 లో పెళ్లి చేసుకొని ఒకటయ్యారు.  ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ పై  ఎంతో ఆనందంగా, చలాకీగా కనిపించే ఈ జంట.. ఇటీవలే ఓ వీడియోలో తమ జీవితంలో జరిగిన విషాదకరమైన సంఘటన గురించి పంచుకున్నారు. తమ జీవితంలో అన్ని ఉన్నా పిల్లలు లేరు అనే వెలితి అలాగే  మిగిలిపోవడానికి  గల కారణాలను బయటపెట్టారు. 

ఆ డైరెక్టర్ కారణంగానే.. 

అయితే ఈ దంపతులకు పెళ్ళై 20 ఏళ్ళు అయినప్పటికీ..  ఇంకా సంతానం కలగలేదు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు మేఘన. ఆమెకు గర్భస్రావం అవడానికి ప్రధాన కారణం డైరెక్టర్ అంటూ చెప్పుకొచ్చింది. "2004 ఆఖరిలో మేము వివాహం చేసుకున్నాము. నాకు రెండు సార్లు గర్భస్రావం అయ్యింది. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒకసారి నేను సీరియల్ షూటింగ్ కోసం వెళ్ళాను. అప్పుడు నాకు రెండో నెల అనుకుంటా.. ఆ సమయంలో ప్రెగ్నెన్సీ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. 

కానీ షూటింగ్ లో భాగంగా ఓ డైరెక్టర్ నన్ను దాదాపు 40 సార్లు మెట్లు ఎక్కించాడు. నేను వద్దు సార్ అని చెప్తున్నా ఆయన వినిపించుకోలేదు. కాసేపటికి నావల్ల కాలేదు.. కింద కూర్చుండిపోయాను. అప్పుడే నాకు రక్తస్రావమైంది. ఆ అబార్షన్ తర్వాత సుమారు ఆరేళ్ళ పాటు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. అదే భాదతో ఇండస్ట్రీకి కూడా దూరమయ్యాను.. శరీర బరువు కూడా పెరిగాను. మా ఇద్దరికీ పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ మాకు ఇప్పుడు 40 ఏళ్ల వయసు వచ్చేసింది. ఇక పిల్లల గురించి ఆలోచించడం మానేశాము" అంటూ ఎమోషనల్ అయ్యారు మేఘన.  

Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?

Advertisment
Advertisment
తాజా కథనాలు