పోర్న్ రాకెట్ కేసు.. నటి శిల్పాశెట్టి భర్తకు ఈడీ సమన్లు

యాప్ ద్వారా పోర్న్ వీడియోలను సృష్టించిన కేసులో నటి శిల్పాశెట్టి భర్తకు ఈడీ సమన్లు జారీ చేసినట్లు సమాచారం. సోమవారం రాజ్‌ను ఈడీ విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరికీ కూడా నోటీసులు జారీ చేశారట.

New Update
raj kundra

పోర్న్ రాకెట్ కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రెడ్ మొబైల్ యాప్ ద్వారా పోర్న్ వీడియోలు సృష్టించడం, పంపిణీ చేసిన కేసు, మనీలాండరింగ్‌ కేసు నేపథ్యంలో ఇటీవల వారి నివాసంలో కూడా ఈడీ సోదాలు నిర్వహించింది. అయితే ఈ కేసు విచారణలో భాగంగా ఈడీ రాజ్ కుంద్రాకు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సోమవారం అతన్ని విచారించనున్నట్లు సమాచారం. అలాగే ఇతనితో పాటు ఇంకెవరికి ఈ కేసుతో సంబంధం ఉందో అందరికీ కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: Fengal Cyclone : తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

అశ్లీల వీడియోాలు తీయించి..

గతంలో 2021లో అశ్లీల వీడియోలు తీయించి.. వాటిని విదేశీ యాప్స్‌లో అప్లోడ్ చేసిన కేసులో  రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్ పై అతను బయటకు వచ్చారు. ముంబై పోలీసులు అప్పట్లో పోర్న్ వీడియోలు చేస్తున్న ఓ ముఠాను ప‌ట్టుకోని విచారిస్తున్న క్రమంలో ఈ వ్యవహారం బయటపడింది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: తెలంగాణలో ఆ ఉద్యోగ నోటిఫికేషన్ రద్దు..

ఈ ముఠా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ కోసం షార్ట్ ఫిల్మ్స్ పేరుతో ఔత్సాహిక న‌టీన‌టుల‌తో అశ్లీల వీడియో తీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలు షూట్ చేసిన తర్వాత వాటిని వాటిని వీట్రాన్స్‌ఫ‌ర్ ద్వారా విదేశీ యాప్‌ల్లో అప్‌లోడ్ చేస్తారు. అయితే ఈ కేసు విచారణలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉమేశ్ కామత్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా... ఇందులో రాజ్‌కుంద్రా పేరు కూడా బయట పడింది.

ఇది కూడా చూడండి: Adani: దాడులు మరింత బలాన్ని ఇస్తాయి..గౌతమ్ అదానీ

ఉమేశ్ కామ‌త్‌  రాజ్‌కుంద్రా దగ్గర పనిచేసేవాడు.  ఈ కేసు పూర్తి విచారణ తర్వాత ఆధారాలతో 2021 జులై 20న రాజ్‌ కుంద్రాను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్ కుంద్రా.. అతని కంపెనీ పోర్న్ చిత్రాల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడంతో పాటు  దేశంలోని చట్టాలను అధిగమించడానికి ఏర్పాట్లు చేశారు.

ఇది కూడా చూడండి: ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే..?

Advertisment
Advertisment
తాజా కథనాలు