మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కిన తాజా చిత్రం 'లక్కీ భాస్కర్'. 'సార్' మూవీతో మంచి సక్సెస్ అందుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 'సీతారామం' తర్వాత దుల్కర్ చేస్తున్న సెకెండ్ స్ట్రెయిట్ తెలుగు మూవీ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ దీపావళి కానుకగా అక్టోబర్ 31 న సినిమా రిలీజ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ కాస్త సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.' నా పేరు భాస్కర్ కుమార్.. నా జీతం ఆరు వేల రూపాయలు. బార్డర్ లైన్ దరిద్రంలో బతుకుతున్నా.. నేనే కావాలని నన్ను చేసుకుంది నా భార్య సుమతి. నా బలం నా భార్య..' అంటూ దుల్కర్ సల్మాన్ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ మొదలైంది.
Also Read : గొప్ప మనసు చాటుకున్న మంచు లక్ష్మి.. 50 స్కూళ్ళు దత్తత తీసుకొని..
డబ్బిచ్చే కిక్కే ఎక్కువ..
ఆ తర్వాత అసలు కథ ఇప్పుడే మొదలైంది అంటూ డబ్బులు లేక అవమానాలు పడ్డ హీరో.. కోట్లు సంపాదించే రిచ్ మ్యాన్ గా ఎలా మారాడు అనే పాయింట్ తో ట్రైలర్ అంతా చూపించారు. అందులో కాలి గోటి నుంచి తల వరకు ఏది కావాలంటే అది కొనుక్కో.. అంత సంపాదించాను అంటూ చెప్పే డైలాగ్ ఆసక్తి పెంచింది. 'సిగరెట్, ఆల్కహాల్,డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బిచ్చే కిక్కే ఎక్కువ..' అనే డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచింది.
మొత్తంగా ఆరు వేల జీతానికి పనిచేసే ఓ మాములు బ్యాంక్ ఉద్యోగి కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? దాని కోసం ఎలాంటి పనులు చేశాడు? ఆలా చేసిన క్రమంలో హీరో ఎదుర్కున్న ఇబ్బందులు ఏంటి? వీటన్నింటికి సమాధానం దొరకాలంటే లక్కీ భాస్కర్ సినిమా చూడాల్సిందే.
Also Read : 'తంగలాన్' ఓటీటీ రిలీజ్ కు లైన్ క్లియర్.. కోర్టులో కేసు కొట్టివేత
ఇప్పటిదాకా లవ్ అండ్ కమర్షియల్ కథలతో వచ్చిన వెంకీ అట్లూరి ఫస్ట్ టైం ఈ సినిమాతో బ్యాంకింగ్ కుంభకోణం అంటూ సరికొత్త కథతో వస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.