/rtv/media/media_files/2025/10/14/mirage-crime-movie-2025-10-14-08-20-24.jpg)
Mirage Crime Movie
Mirage Crime Movie: ‘దృశ్యం’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు జీతు జోసఫ్, మరోసారి ఒక థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం “Mirage”, ఇటీవల థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.
అసిఫ్ అలీ, అపర్ణా బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ లభించింది. కథలో మంచి ట్విస్టులు ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం సినిమాకు అనుకున్న రిజల్ట్ రాలేదు. తక్కువ రోజులకే థియేట్రికల్ రన్‌ను ముగించుకుని ఇప్పుడు OTTకి సిద్ధమవుతోంది.
Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్?
తాజా సమాచారం ప్రకారం, “Mirage” సినిమా అక్టోబర్ 20 నుంచి Sony LIV ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. సినిమా థియేటర్లలో సెప్టెంబర్ మధ్యలో విడుదలై, కేవలం నాలుగు వారాల వ్యవధిలోనే ఓటిటీలోకి వస్తోంది. ఇది థియేటర్ల రన్ తరువాత వచ్చే సాధారణ విండో కంటే తక్కువే.
Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్..!
ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా డబ్ అయి స్ట్రీమింగ్ కానుండడం విశేషం. ఈ చిత్రాన్ని Naad Sstudios, E4 Experiments, Seven 1 Seven Productions, Bedtime Stories సంస్థలు కలిసి నిర్మించాయి. సంగీతం విష్ణు శ్యామ్ అందించగా, హకీమ్ షాజహాన్, హన్నా రెజీ కోషీ, సరవణన్ ముఖ్య పాత్రల్లో నటించారు.
Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!
థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన “Mirage” ఇప్పుడు ఓటిటీలో సెకండ్ ఛాన్స్ కోసం సిద్ధమవుతోంది. దృశ్యం ఫేమ్ జీతు జోసఫ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను అక్టోబర్ 20న Sony LIVలో మిస్ చేయకుండా చూడండి.
Also Read: రజనీకాంత్ "కూలీ" టీవీ ప్రీమియర్‌కు రెడీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?
Follow Us