Kayadu Lohar: అందాలు ఆరబోయడానికి రెడీ: కాయాదు లోహర్

తెలుగులో రీసెంట్ గా డ్రాగన్‌ మూవీతో సూపర్ హిట్ కొట్టి క్రేజీ హీరోయిన్ గా మారిన కయాదు లోహార్‌ మాటాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడనంటూ ఈ అమ్ముడు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

New Update
Kayadu Lohar

Kayadu Lohar

Kayadu Lohar: డ్రాగన్‌ సినిమాతో కొత్తగా యూత్ ఆడియన్స్ క్రష్ లిస్ట్ లో యాడ్ అయిపోయిన హీరోయిన్ కయాదు లోహార్‌. తెలుగులో 2022లో శ్రీ విష్ణు నటించిన 'అల్లూరి' అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ అస్సామీ బ్యూటీ 21 ఏళ్ల వయసులోనే నటిగా ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో కన్నడంలో 'ముగిల్‌పేట' అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఆ తరువాత మలయాళంలో 'పథోన్‌పత్తం నూత్తాండు' అనే చిత్రంతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. మరాఠీ భాషలోనూ 'ప్రేమ్‌ యు' అనే చిత్రంలో నటించారు. 

Also Read: కెనడాకు కొత్త ప్రధానమంత్రి !

అలా కేవలం రెండేళ్లలోనే నాలుగు భాషలను చుట్టేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తమిళ్ లో  డ్రాగన్‌ మూవీతో సూపర్ హిట్ కొట్టి క్రేజీ హీరోయిన్ గా మారిపోయారు. అలాగే వరుస తెలుగు ఆఫర్లను  కూడా దక్కించుకుంటుంది. కాగా ఈ ముద్దుగుమ్మ మాట్లాడిన మాటాలు వైరల్ గా మారాయి తాను తెరపై అందాలను ఆరబోయడంలో ఏమాత్రం వెనుకాడని ఈ అమ్మడు తన నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటే నెటిజన్లు ఆమె మాటలకూ షాక్ అవుతున్నారు.

Also Read:మహిళలకు గుడ్‌న్యూస్‌.. నెలకు రూ.2500 స్కీమ్‌ ప్రారంభం

ధనుష్ అంటే చాలా ఇష్టం- కయాదు లోహార్‌

ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న కయాదు లోహర్‌ను మీ సెలబ్రిటీ క్రష్‌ ఎవరు అన్న ప్రశ్నకు దళపతి విజయ్‌ తన సెలబ్రిటీ క్రష్‌ అని చెప్పారు. విజయ్ యాక్టింగ్ అంటే తనకు చాలా ఇష్టమని. ఆయన నటించిన చిత్రాల్లో తెరి అంటే చాలా ఇష్టం అని చెప్పారు. అయితే రీసెంట్ గా తన ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడుతూ తనకు ధనుష్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఈ విషయంలో మరొకరికి చోటు లేదు అని కూడా చెప్పింది కయాదు. దీంతో ఈ బ్యూటీ వ్యవహారాన్ని గమనించిన నెటిజన్లు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే నటి అంటూ ఆడేసుకుంటున్నారు.

Also Read:హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్‌ సంచనల వ్యాఖ్యలు

Also Read:లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం.. ఎంతకు కొన్నాడు..? ఆ దేశం ప్రత్యేకత ఏంటో తెలుసా?

Advertisment