Telugu Movie Artist Association: జానీ మాస్టర్ వ్యవహారం బయటపడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇతని మీద టాలీవుడ్ ఫిల్మ్ అసోసియేషన్ మా కు ఇంతకు ముందే బాధితురాలు కంప్లైంట్ చేసింది. అయితే చాలా రోజులు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దెబ్బకు జానీ మాస్టర్ వ్యవహారాన్నీ బయటకు వచ్చాయి. కొరియోగ్రాఫర్‌ను ఎంతలా వేధించాడనే వివరాలు అన్నీ తెలిశాయి. తాజాగా దీని మీద మా అసోసియేషన్ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. జానీ మాస్టర్ ఇష్యూ గత రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉంది. ఈ వివాదంలో బాధితురాలు మొదట వర్క్ పరంగా హరాస్మెంట్ అని వచ్చింది. ఆ తరువాత సెక్సువల్ హారాస్మెంట్ అని బయటపెట్టింది. తన స్టేట్మెంట్, జానీ మాస్టర్ స్టేట్మెంట్ కూడా రికార్డు చేశాం. అయితే సెక్సువల్ హరాస్మెంట్ అనేది వర్క్ ప్లేస్ లో కాదు. లీగల్ గా ప్రొసీడ్ అయి పోలీస్ కేసు పెట్టడం జరిగింది. దీనిపై విచారణ కొనసాగుతోందని పరిష్కార కమిటీ ప్యానెల్ సభ్యురాలు ఝాన్సీ తెలిపారు.
ఇదిలా ఉంటే ఈ పరిష్కార ప్యానెల్ ఇంకా మా అసోసియేషన్ ఆఫ్ ద రికార్డ్‌లో సినీ నటులకు, హెల్పర్లు, ఇతర డిపార్ట్‌మెంట్లకు సంబంధించిన వారందరితో మాట్లాడిందని తెలుస్తోంది. ఏమైనా సమస్యలు ఉంటే తమ దగ్గరకు రావాలని...మీడియా దగ్గరకు వెళ్ళొద్దని సూచించిందని చెబుతున్నారు. తాము కచ్చితంగా పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారని తెలుస్తోంది. మీడియా వరకు వెళితే తెలుగు సినిమా అల్లరి పాలవుతుందనే ఉద్దేశంతో మా.. విషయాలను బయటకు వెళ్ళనివ్వొద్దని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సినిమా ఇండస్ట్రీలో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్ కు ఓ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని సూచించనున్నాము. డాన్సర్ యూనియన్ కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు అని తమ్మారెడ్డి బరద్వాజ ప్రెస్ మీట్‌లో చెప్పారు. దాని వెనుక ఇదే ఉద్దేశమని తెలుస్తోంది. ఎలాంటి సమస్యలు ఉన్న తమలో తామే పరిష్కరించే దిశగా మా అడుగులు వేస్తోంది.
పెద్ద పెద్ద నటులకు తప్ప మిగతా వారందరికీ మా ఈ విషయాన్ని చెప్పిందని సమాచారం. హేమలాంటి నటులకు కూడా మీడియా దగ్గరకు వెళ్ళొద్దని హెచ్చరించిందని చెబుతున్నారు. పరిష్కార ప్యానెల్ తప్పకుండా మూవీ ఆర్టిస్ట్‌లకు సహాయం చేస్తుందని...దానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతున్నారు. రీసెంట్‌గా మలయాళ మూవీ ఇండస్ట్రీ మీద హేమ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. దీంతో మిగతా ఇండస్ట్రీస్‌లో కూడా లైంగిక ఆరోపణల సమస్యలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. అయితే మలయాళ ఇండస్ట్రీలో వివాదం చెలరేగినట్టు కాకుండా...గుట్టుగా సమస్యలను సాల్వ్ చేసుకుందాం అనుకుంటోంది తెలుగు ఫిల్మ్ అసోసియేషన్. అందుకే నటులకు, ఆర్టిస్ట్‌లకు...ఇతరులకూ తమ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పాలని , మీడియా దగ్గరకు వెళ్ళొద్దని రిక్వెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్నంతటినీ కూడా ఆఫ్ ద రికార్డ్‌గానే ఉంచారు.
Also Read: మళ్ళీ త్రివిక్రమ్ మీద మరో బాంబ్.. విరుచుకుపడ్డ పూనమ్ కౌర్