telugu Big Boss 9: దివ్వెల కాదు దువ్వాడ..బిగ్ బాస్ లోకి మాధురి దుమ్ము లేపే ఎంట్రీ.. తొలి రోజే షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు తొమ్మది సీజన్ లోకి దివ్వెల మాధురి ఎంట్రీ ఇచ్చి అందరీ సర్ ప్రైజ్ చేసింది. బంధాలు బంధుత్వాలు లేవు...గెలుపు ఒక్కటే లక్ష్యం అని చెప్పింది. ఈ సందర్భంగా తన లైఫ్ లో జరిగిన విషయాల గురించి కూడా బాహాటంగా చెప్పుకుంది. 

New Update
madhuri

తన పేరు దివ్వెల మాధురి కాదు...దువ్వాడ మాధురి అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో తనను దువ్వాడ కిందనే కన్సిడర్ చేయాలని స్పష్టం చేసింది. దీని ముందు ఇచ్చిన ఇంట్రోలో తన జీవితం గురించి మొత్తం చెప్పేసింది. తనను అందరూ ఫైర్ బ్రాండ్ గా పిలుస్తారని..ముక్కు సూటిగా ఉంటానని మాధురి తెలిపింది. తనకు ఇంటర్ లోనే తనకు పెళ్ళి చేశారని...ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని చెప్పుకొచ్చింది. వాళ్ళే సా ప్రపంచం అని కూడా తెలిపింది. బిగ్ బాస్ లో బంధాలు, బంధుత్వాలకు అస్సలు చోటు లేదని...కేవలం గెలవడం మాత్రమే తన టార్గెట్ అని మాధురి స్పష్టం చేసింది. 

ఆనయతో ఉండలేకపోయా..

తన భర్తతో మొదటి నుంచి పెద్దగా అండస్టారింగ్ లేదని తెలిపింది మాధురి. అయినా సరే కలిసి ఉండేందుకు చాలా ఏళ్ళు ప్రయత్నించానని..ఆ క్రమంలోనే ముగ్గురు ఆడపిల్లలు కూడా పుట్టారని అంది. కానీ చివరకు ఉండలేకపోయానని...విడిపోవాల్సి వచ్చిందని చెప్పింది. అదే సమయంలో కుటుంబ సమస్యలతో బాధ పడుతున్న శ్రీనివాస్ గారు కనిపించారని...తనతో నా జర్నీ మొదలైందని మాధురి చెప్పింది. మాధురి అంటే శ్రీనివాస్‌.. శ్రీనివాస్‌ అంటే మాధురిగా నాలుగేళ్లుగా కలిసి బతుకుతున్నామని కుండ బద్దలు కొట్టింది. 

నాలుగేళ్ళుగా నరకం..

అయితే ఈ నాలుగేళ్ళుగా తమను వేధిస్తున్నారని మాధురి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిరోజు సోషల్ మీడియాలో తనపై నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారని...మనిషిగా చంపేస్తున్నారని బాధపడింది. ఆడపిల్లలని చూడకుండా నా కూతుర్లని ట్రోల్‌ చేశారు. నిజంగా నేనేంటో మీకు చూపించాలనుకున్నాను. ఇప్పుడు దువ్వాడ మాధురి 2.0ని బిగ్‌బాస్‌ హౌస్‌లో చూస్తారు, అర్థమైందా రాజా.. అంటూ ఇంటూ ఇంట్రోలు దుమ్ము రేగ్గొట్టింది. సమాజమంతా ఒకవైపు, నేనొక వైపు ఉన్నాం. ఇప్పుడు అందరినీ నా వైపు తిప్పుకోడానికే బిగ్ బాస్ కు వచ్చాను. దువ్వాడ శ్రీనివాస్‌ గారి కోసం ఏదైనా వదులుకుంటాను. ఆయన చెప్పారు కాబట్టే ఈ షోకి వచ్చాను. ఆయన వద్దని అభ్యంతరం చెప్పుంటే రాకుండా ఉండిపోయేదాన్ని అని చెప్పుకొచ్చింది. 

రావడం రావడంతోనే దుమ్ము లేపిన మాధురి బిగ్ బాస్ హౌస్ లో ఇంకెంత రచ్చ చేస్తుందో అంటున్నారు ప్రేక్షకులు. హౌస్ లో ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది. చప్పగా ఉన్న సీజన్ కు ఈమె ఫైర్ రగిలిస్తుందా అని చర్చించుకుంటున్నారు. 

#today-latest-news-in-telugu #Divvala Madhuri Comments On Duvvada Srinivas #bigbosstelugu
Advertisment
తాజా కథనాలు