/rtv/media/media_files/2025/11/07/ssmb29-2025-11-07-08-41-57.jpg)
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ SSMB29 కోసం యావత్ ప్రపంచ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, రాజమౌళి తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఈ సినిమాలో మళయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఓ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. నేడు ఆయన లుక్‌ను విడుదల చేయనున్నట్లు రాజమౌళి తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Amidst the climax shoot on set with all three, there’s a lot more prep happening around the #GlobeTrotter event, as we’re trying something far beyond what we’ve done before…
— rajamouli ss (@ssrajamouli) November 7, 2025
Can’t wait for you all to experience it on Nov 15th. Leading up to it, we’re filling your week with a…
‘‘ ఈ సినిమాలోని మూడు ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. మరోవైపు #GlobeTrotter ఈవెంట్ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడనివిధంగా ఇది మీ ముందుకు రానుంది. నవంబర్ 15న మీరంతా ఈ ఈవెంట్‌ను చాలా ఎంజాయ్ చేస్తారు. ఆరోజు కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. దానికంటే ముందు మీరు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు నేడు పృథ్వీరాజ్ ఫస్ట్‌లుక్‌ను విడుదల కానుందని రాజమౌళి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా
ఇక SSMB29 సినిమా షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది. రాజమౌళి, ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ (Pre-Production) పనులపై దాదాపు సంవత్సరానికి పైగా సమయాన్ని వెచ్చిస్తున్నారు. స్క్రిప్ట్, నటీనటుల ఎంపిక, లోకేషన్ల ఫైనలైజేషన్ వంటి పనులను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. ప్రేక్షకులకు ఇది మునుపెన్నడూ చూడని అడ్వెంచర్ అనుభూతిని ఇవ్వడం ఖాయమని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి తెలిపారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఒక గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఉండనుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులతో అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.
Follow Us