/rtv/media/media_files/2025/07/04/director-anudeep-viral-meme-2025-07-04-09-40-05.jpg)
director anudeep viral meme
Director Anudeep: పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో యంగ్ డైరెక్టర్ అనుదీప్ కి సంబంధించిన ఓ మీమ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అనుదీప్ క్రౌడ్ మధ్యలో నుంచి స్టేజ్ పైకి వెళ్తుండగా.. ఆయనను గుర్తుపట్టలేకపోయిన పోలీసులు వెనక్కి పంపించేశారు. ఇందుకు సంబంధించిన విజువల్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. దీనిపై మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు.
ఒరేయ్ 🤣 పాపం రా నిన్ను హరిహరవీరమల్లు ట్రైలర్ లాంచ్ లో అంట..!
— YuvaSena 🚩 (@YuvaSena_1) July 4, 2025
Anudeep bro 😅 #HHVMTrailerBlazepic.twitter.com/ugzWDzqaiP
'జాతిరత్నాలు' ఫేమ్
ఇదిలా ఉంటే డైరెక్టర్ అనుదీప్ 'జాతిరత్నాలు' సినిమాతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ముగ్గురు స్నేహితుల కథా నేపథ్యంతో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ప్రెసెంట్ ట్రెండ్ కు తగ్గట్లు సినిమాలు చేసి.. యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఈ యువ డైరెక్టర్. అనుదీప్ సినిమాల్లో కామెడీ, పంచ్ డైలాగ్స్, వన్ లైనర్స్ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. 'శివకార్తికేయన్' ప్రిన్స్ తర్వాత అనుదీప్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. కానీ సినీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ ప్రకారం.. అనుదీప్ నెక్స్ట్ మాస్ మహారాజ్ రవితేజతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా స్టోరీ గురించి వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగినట్లు సమాచారం. ఇక ఇది నిజమైతే వీళ్లిద్దరి కాంబో సూపర్ క్రేజీ అనే చెప్పాలి. రవితేజ ఆన్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అనుదీప్ కామెడీ, వన్ లైనర్స్ మామూలుగా ఉండవు. ఇప్పుడు వీళిద్దరి కాంబోలో సినిమా అంటే రవితేజ ఫ్యాన్స్ కు పండగే.
Also Read: Nayanthara-Vignesh: జానీ మాస్టర్ ఎఫెక్ట్.. నయనతార, విఘ్నేష్‌పై దుమ్మెత్తి పోస్తోన్న నెటిజన్లు!