Dharmendra: నిలకడగా ఆరోగ్యం ..  ఆసుపత్రి నుంచి ధర్మేంద్ర డిశ్చార్జ్‌

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

New Update
dharmendra

బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయనను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వాస సంబంధిత సమస్యలతో కొద్దిరోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయినట్లు అధికారికంగా ప్రకటించారు.89 ఏళ్ల ధర్మేంద్ర గత కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతూ చికిత్స కోసం బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆయనను ఐసీయూలో అబ్జర్వేషన్‌లో ఉంచారు. 

సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు

చికిత్స జరుగుతున్న సమయంలోనే, మంగళవారం (నవంబర్ 11) సోషల్ మీడియాలో ధర్మేంద్ర ఆరోగ్యం విషమించిందంటూ, మరణించారంటూ తప్పుడు వార్తలు విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ పుకార్లపై ఆయన కుమార్తె ఈషా డియోల్, భార్య హేమ మాలిని తీవ్రంగా స్పందించారు. "నా తండ్రి కోలుకుంటున్నారు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. దయచేసి బాధ్యతారహితమైన వార్తలను ప్రచారం చేయవద్దు, మా కుటుంబ గోప్యతను గౌరవించండి" అని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు.

ధర్మేంద్ర త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ప్రార్థనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisment
తాజా కథనాలు