Kuberaa: ధనుష్ 'కుబేరా' రన్ లాక్!

ధనుష్, నాగార్జున లీడ్ రోల్స్ లో నటించిన 'కుబేరా' రన్ టైం లాక్ అయ్యింది. ఈ సినిమా రన్ టైంను 3 గంటలుగా ఫిక్స్ చేశారు. ముందుగా 3 గంటల 20 నిమిషాలకు లాక్ చేయగా.. ఆ తర్వాత 3 గంటలకు కుదించారు. 'కుబేరా' ఈ నెల 20న థియేటర్స్ లో విడుదల కానుంది.

New Update

Kuberaa Run Time: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో నటించిన  'కుబేర' చిత్రం ఈనెల 20న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ రన్ టైం లాక్ చేశారు మేకర్స్. 'కుబేరా' రన్ టైం 3 గంటలుగా ఖరారైంది.  ముందుగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల  3 గంటల 20 నిమిషాలకు లాక్ చేయగా.. నిర్మాతలు 3 గంటల మార్కులోపు ఉండేలా తగ్గించమని కోరారు. ఈ మేరకు కమ్ముల  3 గంటలకు కుదించినట్లు సమాచారం. 

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై స్పెషల్ ఫోకస్ 

రాజకీయాలు, రియల్ ఎస్టేట్ మాఫియా వంటి అంశాలతో రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున మాజీ ప్రభుత్వ అధికారిగా కనిపించనుండగా.. ధనుష్ మురికివాడలో నివసించే  బిచ్చగాడి  పాత్రను పోషించారు. రష్మిక ధనుష్ ప్రేమికురాలిగా కనిపించనుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన గ్లిమ్ప్స్, పాటలు, ఇతర ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లకు పేరుగాంచిన శేఖర్ కమ్ముల.. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారట. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

Also Read: Ustaad Bhagat Singh: ఈసారి తుఫానే.. 'ఉస్తాద్ భగత్' సెట్ లో అడుగుపెట్టిన పవర్ స్టార్.. వీడియో అదిరింది!

Advertisment
Advertisment
తాజా కథనాలు