Ustaad Bhagat Singh: ఈసారి తుఫానే.. 'ఉస్తాద్ భగత్' సెట్ లో అడుగుపెట్టిన పవర్ స్టార్.. వీడియో అదిరింది!

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ తిరిగి మొదలైంది. తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ చిన్న గ్లిమ్ప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సెట్స్ లో అడుపెట్టారు.

New Update

Ustaad Bhagat Singh:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ తిరిగి మొదలైంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ చాలా కాలం తర్వాత మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళింది. ఇప్పటికే "హరిహర వీరమల్లు", "ఓజీ" షూటింగ్ లను  పూర్తి  చేసుకున్న పవన్.. ఇప్పుడు 'ఉస్తాద్ ' సెట్స్ లో అడుపెట్టారు. 

కొత్త షెడ్యూల్ లో పవన్ 

జూన్ 10న మంగళవారం  షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభించారు.  ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ఒక చిన్న గ్లిమ్ప్స్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సెట్స్ లోకి అడుగుపెట్టడం చూపించారు. 

దాదాపు 30 రోజుల పాటు

హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో  దాదాపు 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఇందులో  పవన్ తో పాటు శ్రీలీల కూడా పాల్గొంటుంది. ఇద్దరికీ సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.  వీలైనంత త్వరగా షూటింగ్ ముగించుకొని సినిమాను వచ్చే ఏడాది  విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మేకర్స్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. గతంలో పవన్ - హరీష్ కాంబోలో వచ్చిన "గబ్బర్ సింగ్" ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తో ఈ కాంబో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. 

Also Read:HBD Balakrishna: తెలుగు ఇండస్ట్రీలో ఆ రికార్డు కేవలం బాలయ్యకే సొంతం.. ఈ విషయాలు మీకు తెలుసా?

Advertisment
తాజా కథనాలు