దేవర కలెక్షన్ల జాతర.. మరో ఫీట్ క్రాస్ చేసేసిందిగా..

ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ మరో మైల్‌స్టోన్‌కు చేరుకుంది. వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్ల మార్క్‌ని అందుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. దీంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

New Update
devara,

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన కొత్త సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ మూవీలో రెండు పాత్రలో కనిపించి ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. అలాగే ఇందులో హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన అంద చందాలతో తెలుగు ఆడియన్స్‌ని కట్టిపడేసింది. ఇందులో తంగం పాత్రలో నటించి అదరగొట్టేసింది. 

దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తుండగా.. మొదటి పార్ట్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ సీన్లు సినీ ప్రియుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే అనిరుధ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో అలరించింది. బ్యాక్ గ్రౌండ్ ఆర్ఆర్‌తో అనిరుధ్ అదరగొట్టేశాడు. మరోవైపు కీలక పాత్రలో నటించిన సైఫ్ అలీ ఖాన్ తన యాక్టింగ్‌తో సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లాడు. 

ఇది కూడా చదవండి: జాన్వీ కపూర్‌ ప్రాణానికి ప్రమాదకరంగా మారిన ‘దేవర’ సాంగ్.. వీడియో వైరల్

ఇక ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి మూమెంట్‌ని అయినా అలవోకగా చేసేస్తాడు. దానికి తోడు మరో డాన్సర్ తగిలితే ఇక అంతే. సినిమా దద్దరిల్లిపోవల్సిందే. జాన్వీ, ఎన్టీఆర్ దేవరలోని సాంగ్‌లకు అదరిపోయే స్టెప్పులతో ఉర్రూతలూగించారు. ఇలా మొత్తంగా సినిమా అన్ని ఎలిమెంట్స్‌తో సూపర్‌గా ఉందనే చెప్పాలి. 

రూ.500 కోట్ల క్లబ్‌లోకి

తొలి రోజు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన దేవర.. తాజాగా ఊహించని మార్క్‌ని అందుకుంది. వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రూ.500 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఈ ఫీట్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపిది. త్వరలో మరింత కలెక్షన్లు సాధిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు