'దేవర' వీఎఫ్‌ఎక్స్‌.. 30 రోజులు నిద్రలేని రాత్రులు గడిపాం : సినిమాటోగ్రాఫర్

సినిమాటోగ్రాఫర్ రత్నవేలు 'దేవర' వీఎఫ్ఎక్స్ పై పోస్ట్ పెట్టారు.'కలర్‌ గ్రేడింగ్‌, మ్యాచింగ్‌ భారీ వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం' అంటూ ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోతో పాటు.. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు సంబంధించిన పిక్‌ను షేర్‌ చేశారు.

rathnavelu
New Update

ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటూ సినీ లవర్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర'. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 27 పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ భారీ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లింది. 

ఇప్పటికే దేవర ట్రైలర్ యూట్యూబ్ లో  రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతుంది. మరోవైపు మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాకు సంబంధించి ఆసక్తికర విశేషాలు పంచుకుంటున్నారు. ఇక తాజాగా 'దేవర' సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సినిమాకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పై తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టరు. అందులో VFX కోసం ఎంతలా కష్టపడ్డారో వివరించారు. 

Also Read : అప్పుడు వేధిస్తే ఇప్పుడు ఆరోపణలా? .. స్పందించిన ప్రముఖ నిర్మాత

నిద్రలేని రాత్రులు గడిపాం..

దేవర మూవీ సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. సినిమాలో వీఎఫ్‌క్స్‌కు పెద్దపీట వేశారు. ఇటీవల రిలీజైన ట్రైలర్ చూస్తే ఇది అర్థమవుతుంది. అయితే దీనిపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టారు.' 'దేవర' కలర్‌ గ్రేడింగ్‌, మ్యాచింగ్‌ భారీ వీఎఫ్‌ఎక్స్‌ షాట్‌ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రీమియర్‌ లార్జ్‌ ఫార్మట్‌, డీ బాక్స్‌, 4డీఎక్స్‌, ఓవర్సీస్‌2.35ఎమ్‌ఎమ్‌ కంపెనీలు కంటెంట్‌ను సరైన సమయానికి అందించాయి. 

మా దేవరను థియేటర్‌లలో చూసి ఆనందించండి' అని తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ఎన్టీఆర్‌తో దిగిన ఫొటోతో పాటు.. వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌కు సంబంధించిన పిక్‌ను షేర్‌ చేశారు. గతంలోనూ రత్నవేలు ఈ సినిమా విజువల్‌ వండర్‌ అని పేర్కొన్నారు. ఇక ఇందులోని పాటల గురించి ఆయన మాట్లాడుతూ.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్‌ గ్రేస్, స్టైల్, ఎలక్ట్రిఫైయింగ్‌ స్టెప్స్‌కు అభిమానులు బ్రహ్మరథం పడతారని, థియేటర్లలో పూనకాలు పక్కా' అంటూ పేర్కొన్నారు.

#devara #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe