అప్పుడు వేధిస్తే ఇప్పుడు ఆరోపణలా? .. స్పందించిన ప్రముఖ నిర్మాత జానీ మాస్టర్ వ్యవహారంపై నిర్మాత సీ కల్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు. జానీ కేసు సినీ ఇండస్ట్రీపై తప్పుడు సంకేతాలను సృష్టించింది. ఎప్పుడో లైంగికంగా వేధిస్తే ఇప్పుడు ఆరోపణలు చేయటం ఏంటి? ఆరోపణలు చేసిన అమ్మాయికి ఏ నిర్మాత ఆఫర్స్ ఇస్తాడు? అని అన్నారు. By Anil Kumar 21 Sep 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి కొరియోగ్రఫర్ జానీ మాస్టర్.. డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన వివాదం సినీ ఇండస్ట్రీలో చర్చయానీయాంశమైన విషయం తెలిసిందే. ఈ వివాదంలో జానీ మాస్టర్‌పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదు కాగా.. దీనిపై విచారణ జరిపిన ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్‌లో ఉంచాలని ఆదేశించింది. దీంతో జానీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే ఈ వివాదంపై సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు జానీపై పోలీసు కేసు పెట్టాక.. కమిటీ సభ్యులు ప్రెస్‌మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటని? ప్రశ్నించారు.' జానీ కేసు సినీ ఇండస్ట్రీపై తప్పుడు సంకేతాలను సృష్టించింది. సినిమా పరిశ్రమలో అందరూ ప్రొఫెషనల్‌గా ఉంటూ పని చేసుకుంటారు. Also Read : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్.. 'దేవర' నుంచి మరో ట్రైలర్ అది నిజం కాదు.. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మహిళా టెక్నిషియన్స్‌ను చూసి తోటి వారు ఇబ్బందిపడే పరిస్దితి నెలకొంది. ఎప్పుడో లైంగికంగా వేధిస్తే ఇప్పుడు ఆరోపణలు చేయటం ఏంటి? ఆరోపణలు చేసిన అమ్మాయికి ఏ నిర్మాత ఆఫర్స్ ఇస్తాడు? ప్రతిభ, క్రమశిక్షణ ఉన్న వారికే ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ వస్తే ఇండస్ట్రీలో కమిటీకి బలం చేకూరుతుందనేది నిజం కాదు' అని అన్నారు. దీంతో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. జానీ భార్య పై కేసు.. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదుకు రంగం సిద్ధం చేశారు పోలీసులు. గతంలో జానీ మాస్టర్‌తో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు పోలీసుల చర్యలు చేపట్టారు. ఇప్పటికే బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో జానీ భార్యను నిందితురాలుగా చేర్చాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జానీ భార్యతో పాటు మరో ఇద్దరిని నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. #choreographer-jani-master మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి