Poonam Pandey: మండోదరి పాత్రలో పూనమ్.. వ్యతిరేకిస్తున్న BJP, VHP

ఢిల్లీలోని ప్రసిద్ధ లవ్ కుష్ రామ్లీలా కమిటీ నటి పూనమ్ పాండేను 'మండోదరి' (రావణుని భార్య) పాత్ర కోసం ఎంపిక చేయడంపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పి) తీవ్రంగా వ్యతిరేకించాయి

New Update
mandodari

ఢిల్లీలోని ప్రసిద్ధ లవ్ కుష్ రామ్లీలా కమిటీ నటి పూనమ్ పాండేను 'మండోదరి' (రావణుని భార్య) పాత్ర కోసం ఎంపిక చేయడంపై తీవ్ర వివాదం చెలరేగింది. ఈ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పి) తీవ్రంగా వ్యతిరేకించాయి, ఆమె స్థానంలో వేరే నటిని నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి.

పూనమ్ పాండే గతంలో చేసిన కొన్ని వివాదాస్పద ప్రకటనలు ఆమెకు ఉన్న బోల్డ్ ఇమేజ్ కారణంగా హిందూ సంఘాలు ఈ పాత్రకు ఆమె తగినవారు కాదని భావిస్తున్నాయి. రాముడి జీవితంపై ఆధారపపడిన రామ్లీలా వంటి పవిత్ర వేదికపై ఇలాంటి వ్యక్తిని ఎంపిక చేయడం హిందూ సంస్కృతిని అవమానించడమేనని ఆరోపించాయి.

తీవ్ర అభ్యంతరం

విశ్వ హిందూ పరిషత్ (ఢిల్లీ చాప్టర్) కార్యదర్శి సురేంద్ర గుప్తా ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రామ్లీలా వంటి పవిత్ర కార్యక్రమాలలో సనాతన సంస్కృతికి అనుగుణంగా ప్రవర్తించే, భక్తిభావం ఉన్న నటీనటులను మాత్రమే ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు.  

ఢిల్లీ బీజేపీ ఈ వివాదంపై స్పందిస్తూ, లవ్ కుష్ రామ్లీలా కమిటీ వెంటనే తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరింది. ప్రజాస్వామ్యంలో ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని, ఒక వివాదాస్పద వ్యక్తిని మండోదరి వంటి పవిత్ర పాత్రకు ఎంపిక చేయడం సరైనది కాదని పేర్కొంది.

విమర్శలు వస్తున్నప్పటికీ, లవ్ కుష్ రామ్లీలా కమిటీ మొదట్లో తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంది. అయితే, ఈ అంశంపై కమిటీలోని సభ్యుల మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. దీనిపై కమిటీ త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisment
తాజా కథనాలు