Deepika Padukone: ప్రెగ్నెన్సీ తర్వాత పాన్ ఇండియా హీరోతో దీపికా రీఎంట్రీ.. ఊహించని రేంజ్ లో రెమ్యునరేషన్!

ప్రెగ్నెన్సీ తర్వాత నటి దీపికా.. ప్రభాస్ 'స్పిరిట్' సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సినిమాలో దీపికా రెమ్యునరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. దాదాపు రూ. 20 కోట్లు ఛార్జ్ చేసినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.

New Update

Deepika Padukone:  బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా- ప్రభాస్ కాంబోలో రాబోతున్న  'స్పిరిట్'  సినిమాలో ఫీమేల్ లీడ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ ప్రాజెక్ట్ లోకి దీపికా జాయిన్ అవడం సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. 

భారీ రెమ్యునరేషన్ 

అయితే ప్రాజెక్టులో దీపికా రెమ్యునరేషన్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఇందులో నటించేందుకు దీపికాకు  భారీ రెమ్యునరేషన్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ. 20 కోట్లు ఛార్జ్ చేసినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. దీపిక 18 ఏళ్ళ సినీ కెరీర్ లో ఇప్పటివరకు తీసుకున్న అత్యధిక రెమ్యునరేషన్ ఇదే కావడం విశేషం. సినీ వర్గాల్లో టాక్ ప్రకారం.. ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దీపికా దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్ లో ఒకరిగా నిలిచే అవకాశం ఉంది. కల్కి తర్వాత ప్రభాస్- దీపికా కలిసి నటించబోయే రెండో చిత్రమిది. 

'కల్కి' : ఎవరి రెమ్యునరేషన్ ఎంత?

ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో దీపికా  క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని సమాచారం. యాక్షన్, ఎమోషన్ రెండింటీకీ ప్రాధాన్యం ఉండేలా క్యారెక్టర్ ఉంటుందట. అయితే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.. దీపికకు 'స్పిరిట్' కథ  చెప్పడం ఇది రెండోసారట. మొదటగా ఓ సారి స్క్రిప్ట్ పంపించగా.. ఆమె ప్రెగ్నెంట్ కావడంతో నో చెప్పారట. అదే టైంలో మూవీ కూడా ఆలస్యం అవడంతో.. ఇప్పుడు మళ్ళీ దీపికకు కథ వినిపించగా ఆమె వెంటనే ఒకే చెప్పారని సమాచారం. 

telugu-news | cinema-news | telugu-cinema-news | deepika-padukone

#Deepika Padukone #telugu-cinema-news #cinema-news #telugu-news
Advertisment
Advertisment
తాజా కథనాలు