David Warner: 3 నిమిషాలకు.. అన్ని కోట్ల.. 'రాబిన్హుడ్' డేవిడ్ వార్నర్ కి కళ్ళు చెదిరే రెమ్యునరేషన్!

'రాబిన్హుడ్' సినిమాలో నటించేందుకు క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం వార్నర్ రూ. 2.5 to 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం.

New Update

David Warner: ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ 'రాబిన్హుడ్' మూవీతో తెరంగేట్రం చేశారు. నేడు విడుదలైన ఈ సినిమాలో 'వార్నర్' పాత్రకు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ 'రాబిన్హుడ్' సినిమాలో నటించేందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారనే వార్త ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. సినిమాలో వార్నర్ కేవలం 3 నిమిషాల పాటే ఉన్నప్పటికీ.. భారీగానే తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఎన్ని కోట్లంటే 

'రాబిన్హుడ్' కోసం డేవిడ్ వార్నర్ రూ. 2.5 నుంచి 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. రెండు రోజులు మాత్రమే ఆయనకు సంబంధించిన  షూటింగ్ జరిగిందట. దీని ప్రకారం.. ఒక్క రోజుకు 1.25 కోట్లు ఛార్జ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు. అయితే వార్నర్ షూటింగ్ తో పాటు మూవీ ప్రమోషన్స్ లో కూడా పాల్గొన్నారు. 

latest-news | telugu-news | robinhood david warner 

ఇది కూడా చూడండి: Bharat-America:అమెరికా నుంచి సాయం ఆగిపోతే కనుక ...10 లక్షల మరణాలు !

Advertisment
Advertisment
తాజా కథనాలు