చల్లటి నీళ్లతో స్నానం చేసే వారు జాగ్రత్త! ప్రాణాలకే ముప్పు సాధారణంగా చన్నీళ్ళ స్నానం ఆరోగ్యానికి మంచిది. కానీ కొంతమందికి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా డయాబెటిక్, అధిక రక్తపోటు, వృద్ధులు, గుండె సమస్యలు ఉన్నవారు చల్ల నీటి స్నానానికి దూరంగా ఉండాలని నిపుణుల సూచన. ఇలాంటి వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. By Archana 10 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update cold water shower షేర్ చేయండి Cold water shower: సాధారణంగా వేడి నీటితో పోలిస్తే చల్ల నీటితో స్నానం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. చల్ల నీళ్లతో స్నానం చేయడం శరీరంలో రక్తప్రసరణ పెంచి.. జీవక్రియను మెరుగుపరుస్తుంది. కానీ చలికాలంలో ముఖ్యంగా కొన్ని సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా చల్ల నీటితో స్నానం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ (PAD), వృద్ధులు, గుండె జబ్బులు లేదా బ్రెయిన్ స్ట్రోక్ హిస్టరీ ఉన్నవారు చలికాలంలో చన్నీళ్ళ స్నానానికి దూరంగా ఉండడం మంచిదని నిపుణుల అభిప్రాయం. ఇలాంటి వారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. Also Read: లేడీ సూపర్ స్టార్ సినీ కెరీర్, సక్సెస్, లవ్ స్టోరీ.. 'నయనతార: బియాండ్ ది ఫేరిటెల్' ట్రైలర్ ఈ సమస్యలు ఉన్నవారికి చల్ల నీటి స్నానం ప్రమాదం బ్రెయిన్ స్ట్రోక్ బ్రెయిన్ సంబంధింత సమస్యలు ఉన్నవారు చలికాలంలో చల్లనీటి స్నానానికి దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. చల్ల నీటి స్నానం వాస్కులర్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితి వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. Also Read: US: ట్రంప్ గెలుపు...అమెరికాకు గుడ్ బై చెబుతున్న హాలీవుడ్ హీరోయిన్లు గుండెపోటు గుండె సమస్యలతో బాధపడేవారు కూడా చల్ల నీటి స్నానానికి దూరంగా ఉండడం మంచిది. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో ఆకస్మాత్తుగా మార్పులు వస్తాయి. దీని కారణంగా హార్ట్ రేట్ వేగం అనేక సార్లు ప్రభావితమవుతుంది. ఇది గుండెపోటు ప్రమాదానికి దారితీస్తుంది. అలాగే చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. దీని వల్ల గుండె రక్తాన్ని శరీర భాగాలకు పంప్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇప్పటికే గుండె పోటు ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. Also Read: USA: ట్రంప్ గెలవడానికి మీరే కారణం..మీతో సెక్స్ చేయం-యూఎస్ మహిళలు కండరాల నొప్పి చల్లటి నీళ్లతో స్నానం చేయడం వల్ల కండరాల , తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే ఈ సమస్యలతో బాధపడేవారికి సమస్య మరింత పెరుగుతుంది. అతి చల్లని లేదా వేడి నీటితో స్నానం చేయకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read: రింగు రింగుల జుట్టు.. వంకాయ్ కలర్ శారీ.. అనుపమను ఇలా చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే! #bathing #Cold Water Bath #Cold Water bathing #Cold Water Bath uses #uses of Cold Water Bath మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి