/rtv/media/media_files/2025/09/08/this-week-ott-movies-2025-09-08-19-15-54.jpg)
this week ott movies
OTT MOVIES: ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వచ్చిన తర్వాత ఎంటర్ టైన్మెంట్ కి కొదువ లేకుండా పోయింది. ప్రతీ వారం కొత్త సినిమాలు, కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతాయి ఓటీటీస్! ఈ వారం కూడా బోలెడు సినిమాలు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. సినిమాల లిస్ట్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
ఈ వారం ఓటీటీ సినిమాల లిస్ట్
కన్నప్ప
మంచు విష్ణు హీరోగా ప్రభాస్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ తదితర స్టార్ కాస్ట్ ప్రధాన పాత్రల్లో నటించిన కన్నప్ప చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. భారీ అంచనాలతో థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ గా డిజాస్టర్ అనిపించుకుంది. దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కన్నప్ప కేవలం రూ. 40-50 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు సమాచారం. కానీ, ఈ సినిమాలో మంచు విష్ణు నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
మాలిక్
బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ గ్యాంగ్ స్టార్ డ్రామా మాలిక్. జులై 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
బన్ అండ్ బటర్
రాజు జయమోహన్, ఆద్య ప్రసాద్, భవ్య నిఖిత లీడ్ రోల్స్ లో నటించిన 'బన్ బటర్ జామ్ ' అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.
కూలీ
రజినీకాంత్ హీరోగా నటించిన కూలీ సెప్టెంబర్ 21 అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గత నెల థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. రజినీకాంత్ స్క్రీన్ ప్రజెన్స్ తప్పా సినిమా కథలో బలం లేదని విమర్శలు వచ్చాయి. అలాగే నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ క్యామియోలను వేస్ట్ చేశారని ప్రేక్షకులు అభిప్రాయంపడ్డారు.
సు ఫ్రమ్ సో
జే. పి తుమినాడు దర్శకత్వం వహించిన సు ఫ్రమ్ సో సెప్టెంబర్ 9 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ ద్వారా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.
సన్‌నెక్ట్స్
- సరెండర్
- ఫుటేజ్
- తందాట్టి
- కథికాన్
జీ5
- కమ్మాట్టమ్
- అంఖోన్ కీ గుస్తాకియాన్
జియో సినిమా
- స్పైడర్స్
- ది ఆర్ట్‌ఫుల్ డాజర్ (వెబ్‌సిరీస్: సీజన్1)
- లిలో అండ్ స్టిచ్చీ
- ఏ మినిక్రాఫ్ట్ మూవీ
- హౌ టు హేవ్ సెక్స్
- బ్లడీ అండ్ మిత్
- ఇన్‌స్పెక్టర్ జిండే
అమెజాన్ స్ట్రీమింగ్ మూవీస్
- సూత్రవాక్యం
- రవీంద్ర నీ
- ఎవిడి కొతల్వాడి
- జగమెరిగిన సత్యం
- ప్యాడ్ గయే పంగీ
- డ్యామేజ్డ్
- మాలిక్
- గుడ్ వన్
- ది రన్ అరౌండ్స్
ఆహా స్ట్రీమింగ్ మూవీస్
- ఆదిత్య విక్రమ వ్యూహ