Cinema: షారుక్ కొడుకు డైరెక్షన్ లో రాజమౌళి, అమీర్.. 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ట్రైలర్ లో అదిరిపోయే సర్ప్రైజ్ !

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా మారాడు. ఆర్యన్ దర్శకత్వం వహించిన బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సీరీస్ సెప్టెంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సీరీస్ ట్రైలర్ విడుదల చేశారు.

New Update

నటన కంటే డైరెక్షన్ 

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని చీకటి కోణాలు, సమస్యలు, వాటి వల్ల కలిగే కష్టాలను ఆర్యన్ ఖాన్ ఈ సీరీస్ లో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.  అలాగే  సినిమా పరిశ్రమలో  ఎదురయ్యే  ఇబ్బందులను కూడా ఇందులో చూపించబోతున్నారు.  షారుక్ ఖాన్ సొంత ప్రొడక్షన్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. షారుక్ కుమారుడు  ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన  చేస్తున్న తొలి సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. చిన్నతనంలోనే  నటుడిగా  కెరీర్ మొదలు పెట్టిన ఆర్యన్.. ఇప్పుడు డైరెక్టర్ గా కూడా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి సిద్దమయ్యాడు. 

ఆర్యన్ ఖాన్ 2001లో  'కభీ ఖుషీ కభీ గమ్' సినిమాలో  చిన్నప్పటి షారుక్ ఖాన్ పాత్రలో నటించాడు.  ఆ తర్వాత 2019 లో విడుదలైన "ది లయన్ కింగ్" సినిమాలో  సింబా పాత్రకు హిందీ వెర్షన్ డబ్బింగ్ చెప్పాడు. అయితే ఆర్యన్ కి నటన కంటే స్క్రీన్ రైటింగ్ పై ఆసక్తి ఎక్కువట. అందుకే డైరెక్టర్ గా మారినట్లు తెలుస్తోంది. 

Also Read: Andhra King Taluka: ''పప్పీ షేమ్''.. ఆంధ్ర తాలూక నుంచి రామ్ మాస్ బీట్ అదిరింది! సాంగ్ చూశారా

Advertisment
తాజా కథనాలు