Bison Trailer: కబడ్డీ గ్రౌండ్​లో విక్రమ్ కొడుకు కుమ్మేసాడుగా..! ‘బైసన్‌’ ట్రైలర్‌ చూసేయండి..

విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా నటించిన కబడ్డీ, రాజకీయ అంశాల నేపథ్యంలో రూపొందిన “బైసన్” సినిమా తెలుగు ట్రైలర్‌ను రానా విడుదల చేశారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో అక్టోబర్ 17న, తెలుగులో అక్టోబర్ 24న విడుదల కానుంది.

New Update

Bison Trailer: తమిళ స్టార్ హీరో విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్(Chiyaan Vikram Son Dhruv Vikram) నటించిన తాజా చిత్రం “బైసన్”(Bison Movie) త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా, కబడ్డీ నేపథ్యంతో పాటు రాజకీయ నేపథ్యంలో రూపొందింది. దర్శకుడు మారి సెల్వరాజ్ ఈ సినిమాను తాను స్పెషలైజ్ అయిన రా & రస్టిక్ స్టైల్‌లో తెరకెక్కించాడు.

Also Read: ఇద్దరు హీరోయిన్లతో సిద్దూ ఫుల్ రొమాన్స్.. పిచ్చెక్కిస్తున్న 'తెలుసు కదా' ట్రైలర్!

ఈ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్‌ను అక్టోబర్ 14న టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి విడుదల చేశారు. ట్రైలర్ రిలీజైన వెంటనే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందుకుంది. రానా కూడా చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు.

Also Read: రజనీకాంత్ "కూలీ" టీవీ ప్రీమియర్‌కు రెడీ.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే..?

ట్రైలర్‌లో ఏముంది?

తెలుగు ట్రైలర్‌ను చూస్తే.. ఇది కేవలం కబడ్డీ క్రీడపై ఆధారపడిన సినిమా మాత్రమే కాదు, 1990ల కాలంలో చోటుచేసుకున్న సామాజిక, రాజకీయ అంశాలతో కూడిన బలమైన కథగా అనిపిస్తోంది. కథలో ధృవ్ ఒక కబడ్డీ ఆటగాడిగా కనిపిస్తాడు. కానీ అతని ప్రయాణం క్రీడతో పాటు తన సమాజాన్ని, హక్కులను నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో కూడా సాగుతుంది. దీంతో కథలో తీవ్ర భావోద్వేగాలు, సంఘర్షణలు ఉంటాయనేది  తెలుస్తోంది.

Also Read: ఓటీటీలో దూసుకెళ్తున్న 'లిటిల్ హార్ట్స్' ఏకంగా అన్ని మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్..!

ఈ సినిమా తమిళంలో అక్టోబర్ 17న విడుదల కానుండగా, తెలుగులో మాత్రం అక్టోబర్ 24న థియేటర్లలోకి రానుంది. ధృవ్‌కు ఇది చాలా కీలకమైన సినిమా కానుంది. ఇప్పటివరకు తండ్రి విక్రమ్ స్థాయిలో పేరు తెచ్చుకోలేని ధృవ్, ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంటాడా? అనే విషయం మీద సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Also Read: మాధురికి దువ్వాడ ఎలా పరిచయం.. అక్కడే ఇద్దరి మధ్య లేటు వయసులో ఘాటు ప్రేమ!

ఈ చిత్రాన్ని అప్లాస్ ఎంటర్టైన్మెంట్స్, నీలం స్టూడియోస్ బ్యానర్స్ పై నిర్మించారు. టెక్నికల్ గాంభీర్యంతో కూడిన ఈ సినిమా, సోషల్ మెసేజ్‌తో పాటు మాస్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసిన సినిమాగా ఉండనుందని ట్రైలర్‌నే చూస్తే అర్థమవుతోంది.

Advertisment
తాజా కథనాలు