/rtv/media/media_files/2025/07/23/anil-ravipudi-2025-07-23-18-11-57.jpg)
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 157వ సినిమాకి ఇంకా అధికారిక టైటిల్ ఖరారు కాలేదు. దీనికి 'మెగా 157' అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుగుతోంది. అయితే, ఈ సినిమాకు "మన శంకరవరప్రసాద్" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఇదే టైటిల్ అని అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశారు. ముచ్చటగా మూడో షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్లు అనిల్ రావిపూడి ఎక్స్ వేదికగా తెలిపారు. ‘‘మన శంకరవరప్రసాద్ గారు’ ముచ్చటగా మూడో షెడ్యూల్‌ని కేరళలో పూర్తి చేసుకుని వచ్చారు’’ అని ఓ వీడియోను షేర్ చేశారు. అయితే ఇందులో ప్రత్యేకంగా ‘మన శంకర వరప్రసాద్’ పేరుకు కోట్స్ పెట్టడంతో మూవీ టైటిల్ ఇదే అని చిరు అభిమానులు అనుకుంటున్నారు.
“మన శంకరవరప్రసాద్ గారు” ముచ్చటగా మూడవ షెడ్యూల్ ని కేరళలో పూర్తిచేసుకుని వచ్చారు✨#ChiruAnil
— Anil Ravipudi (@AnilRavipudi) July 23, 2025
Megastar @KChiruTweets garu, #Nayanthara#Bheemsceciroleo@sahugarapati7@sushkonidela#Archana@YoursSKrishna@Shine_Screens@GoldBoxEntpic.twitter.com/VEcKj9FYMb
చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న సినిమా టైటిల్‌ను, ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఇందులో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, కేథరీన్ థెరిస్సా కూడా మరో కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్‌తో ఒక అతిథి పాత్ర చేయిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో 70% కామెడీ, 30% ఎమోషనల్ డ్రామా ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి వెల్లడించారు.
చిరంజీవి డ్యూయెల్ రోల్
చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నారని కూడా కొన్ని వార్తలు సూచిస్తున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి ఒక స్కూల్ డ్రిల్ మాస్టర్‌గా శివశంకర వరప్రసాద్‌గా కనిపించనున్నారని కూడా ఒక టాక్ ఉంది. ఈ సినిమాలో చిరంజీవికి కొత్త లుక్, డిక్షన్, బాడీ లాంగ్వేజ్‌తో ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నారని టాక్.