మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో 'విశ్వంభర' సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ముందే ప్రకటించారు. అయితే అదే రోజు 'గేమ్ ఛేంజర్' రిలీజ్ చేస్తున్నారు. దాంతో 'విశ్వంభర' పొంగల్ బరి నుంచి తప్పుకుంది. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఎవరూ ఊహించని డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారట.
అతను మరెవరో కాదు, ప్రముఖ రచయిత BVS రవి. తాజాగా ఈయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనతంతం మీడియాతో మాట్లాడుతూ.. 'బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన 4వ సీజన్ తొలి ఎపిసోడ్ మంచి విజయం అందుకున్న సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చా..' అని చెప్పారు.
Also Read : పూర్ణ మ్యారేజ్ డే.. పెళ్లి ఫొటోలు షేర్ చేసిన హీరోయిన్
మెగాస్టార్ తో అలాంటి సినిమా..
తర్వాత ఏం సినిమాలు చేయబోతున్నారని విలేకర్లు అడగ్గా.." చిరంజీవి, రవితేజతో సినిమా చేయాలనుకుంటున్నా. ‘విశ్వంభర’ పూర్తయిన తర్వాత చిరంజీవితో మేం సినిమా చేస్తాం. చిరంజీవి డ్యాన్స్, ఫైట్స్‌ను ప్రేక్షకులు చూసేశారు. సామాజిక అంశాలతో ముడిపడిన చిత్రాల్లో ఆయన నటిస్తే విశేషంగా ఆదరించారు.
అగ్ర హీరోలు అలాంటి సినిమాలు చేస్తే సోషల్ ఎలిమెంట్స్ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. మేం కూడా ఆయనతో అలాంటి చిత్రమే చేయాలనుకుంటున్నాం..." అని తెలిపారు. ఇక పలు సూపర్ హిట్ సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పనిచేసిన బీవీఎస్ రవి.. 'వాంటెడ్' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ తో 'జవాన్' సినిమా తీశాడు. ఈ రెండు సినిమాలు పరాజయం పొందాయి.
Also Read : 'గేమ్ ఛేంజర్' కౌంట్ డౌన్ షురూ.. ట్రెండింగ్ లో కొత్త పోస్టర్