ఒకే పెళ్ళిలో సందడి చేసిన అల్లు అర్జున్, చిరంజీవి.. ఫొటోలు వైరల్

అల్లు అర్జున్, చిరంజీవి తాజాగా ఒకే పెళ్ళిలో సందడి చేశారు. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ఓ వివాహా వేడుకలో తన భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి బన్నీ హాజరయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update
bunni

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా ఫ్యామిలీతో ఓ పెళ్లి వేడుకలో సందడి చేశాడు. అయితే ఇదే పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి కూడా రావడం విశేషం. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో జరిగిన ఓ వివాహా వేడుకలో తన భార్య స్నేహరెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి బన్నీ హాజరయ్యారు. 

ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ సాధన ఈ పెళ్ళికి సంబంధించిన ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అల్లు -మెగా  కుటుంబాల మధ్య విభేదాలు వస్తున్నాయని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : 'పుష్ప2' గంగమ్మ తల్లీ జాతర సీన్.. థియేటర్ లో పూనకాలతో ఊగిపోయిన మహిళ

 ఒకే పెళ్ళిలో బన్నీ, చిరు..

ఇటీవల బన్నీ 'పుష్ప2' మూవీకి సైతం మెగా హీరోలెవరూ సపోర్ట్ చేయకపోవడం, సినిమా రిలీజ్ తర్వాత పుష్ప టీమ్ ను చిరు ఇంటికి పిలిచి అభినందించగా.. అందులో బన్నీ ఉండకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇలాంటి తరుణంలో బన్నీ, చిరు ఓకే పెళ్లికి హాజరవడంతో టాలీవుడ్‌ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. కాగా ఈ పెళ్లి వేడుకల్లో అల్లు అరవింద్, అల్లు శిరీష్‌ కూడా పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

ఇది కూడా చూడండి: వందే భారత్ స్లీపర్ రైళ్లకు ముహుర్తం ఫిక్స్‌..ఈ మార్గంలోనే తొలి రైలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు