Chhaava: మాడాక్ ఫిల్మ్స్ బ్యానర్ పై డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన హిందీ చిత్రం 'చావా' భారీ విజయాన్ని అందుకుంది. మరాఠా సామ్రాజ్యం రెండవ పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం రూపొందింది. ఇందులో శంభాజీ మహారాజ్ గా విక్కీ నటనకు ప్రశంసలు వెలువెత్తాయి. హిందీతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ సినిమాకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో పలు భాషల్లో డబ్ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు. కాగా,'చావా' తెలుగు వెర్షన్ డిస్ట్రిబ్యూటర్ గా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ వ్యవహరిస్తోంది.
Also Read: This Week Movies: మహాశివరాత్రి స్పెషల్.. థియేటర్, ఓటీటీలో సినిమాల జాతర! లిస్ట్ ఇదే
ఏకంగా 550 థియేటర్లలో
అయితే ఈ చిత్రానికి తెలుగులో మంచి బజ్ ఉండడంతో.. విడుదలను భారీగా ప్లాన్ చేసింది గీతా ఆర్ట్స్. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 550 కి పైగా స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హిందీ వెర్షన్ విడుదలైనప్పటికీ.. ఇక్కడి అభిమానులు తెలుగు వెర్షన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మేకర్స్ ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
#Chhaava's ROAR just got massive🔥#ChhaavaTelugu gets a spectacular release in over 550 screens across AP & TG💥
— Geetha Arts (@GeethaArts) March 6, 2025
GRAND RELEASE TOMORROW by #GeethaArtsDistributions ⚔️
Book Your Tickets Now
🎟 https://t.co/wO4ATbQMXV#ChhaavaInCinemas #ChhaavaRoars@vickykaushal09… pic.twitter.com/zucIss80wA
మార్చి 7న చావా థియేటర్స్ లో విడుదల కానుంది. ఇటీవలే 'చావా' తెలుగు ట్రైలర్ రిలీజ్ చేయగా 5 మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇందులో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్ పాత్రను పోషించగా.. ఆయన భార్య ఏసుబాయ్ పాత్రలో రష్మిక మందన్న నటించారు.
Also Read: DIL Raju: విజయ్ సినిమాపై నోరు జారిన దిల్ రాజ్.. వెంటనే సోషల్ మీడియాలో అనౌన్స్మెంట్