శ్రీరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం.. అక్కడ కేసు నమోదు

శ్రీరెడ్డికి ఏపీ పోలీసులు షాకిచ్చారు. శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో కేసు నమోదు అయింది. చంద్రబాబు, పవన్‌, అనితలపై గతంలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు.

New Update
actress Sri Reddy

నటి శ్రీరెడ్డి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు సృష్టిస్తూ వివాదాల్లో చిక్కుకుంటుంది. ప్రతి విషయంలోనూ వేలు పెడుతూ చిక్కుల్లో ఇరుక్కుంటుంది. అయితే గత వైసీపీ హయంలో శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయింది. అప్పటి ప్రతిపక్ష నాయకులపై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేసింది.

Also Read :  కలెక్టర్ పై దాడి ఎలా చేశారంటే.. రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు!

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సహా వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా తరచూ వీడియోలు రిలీజ్ చేసి సంచలనం క్రియేట్ చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా 2024 ఎలక్షన్ టైంలో జగనే సీఎం అంటూ.. మళ్లీ జగన్ సీఎం అయితే ఒక్కొక్క ప్రతిపక్ష నాయకుడికి తాటతీస్తా అని వీడియోలు షేర్ చేసింది. 

Also Read :  రేష‌న్ మాఫియాపై ఉక్కుపాదం.. 1010 క్రిమినల్ కేసులు నమోదు!

అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అవడంతో సోషల్ మీడియాలో పత్తా లేకుండా పోయింది. ఇక ఇటీవలే సంచలన పోస్టు పెట్టింది. ఏపీలో అసభ్యకర పోస్టులు పెట్టిన వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో కాస్త వెనక్కి తగ్గిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రి లోకేశ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు తనను క్షమించాలని కోరింది. 

నన్ను క్షమించండి

తానుకూడా వారందరిపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని, ఇక నుంచి అలా చేయనని చెప్పింది. తనతోపాటు వైసీపీ కార్యకర్తలను కూడా క్షమించి వదిలేయాలని కోరడం విశేషం. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టీడీటీ, జనసేన కార్యకర్తలు రకరకాల కామెంట్లు చేశారు. 

కేసు నమోదు

తాజాగా శ్రీరెడ్డికి ఏపీ పోలీసులు షాక్ ఇచ్చారు. శ్రీరెడ్డిపై తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో కేసు నమోదు అయింది. చంద్రబాబు, పవన్‌, హోంమంత్రి అనితలపై గతంలో శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి, మాజీ కార్పొరేటర్ మజ్జి పద్మ ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

Advertisment
తాజా కథనాలు