Cinema: బుల్లి రాజు- మెగాస్టార్ సీన్ లీక్.. థియేటర్ లో నవ్వులే నవ్వులు

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుంచి లీకైన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో చైల్ ఆర్టిస్ట్ బుల్లి రాజు- మెగాస్టార్ చిరంజీవి నవ్వుతూ సీన్ చేయడం కనిపిస్తోంది. 

New Update

Cinema: బుల్లిరాజు.. ఈ మధ్య కాలంలో బాగా వైరలైన పేరిది. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఈ బుడ్డోడి రేంజే మారిపోయింది. అందులో వెంకటేష్ కొడుకు పాత్రలో తన మాటలు, కామెడీతో ప్రేక్షకులను ఫిదా చేశాడు. అప్పటివరకూ ఎవరికీ తెలియని బుల్లిరాజు ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఎంతలా పాపులర్ అయ్యాడంటే.. ప్రస్తుతం సినిమాల్లో ఏదైనా చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర ఉందంటే మనోడిని ఫస్ట్ ఛాయిస్ గా తీసుకుంటున్నారు డైరెక్టర్లు. అలా మరో స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేశాడు బుల్లిరాజు. 

చిరంజీవితో బుల్లిరాజు 

మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో బుల్లిరాజు కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా సెట్స్ లీకైన  చిరంజీవి- బుల్లిరాజు ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో బుల్లి రాజు- మెగాస్టార్ చిరంజీవి నవ్వుతూ సీన్ చేయడం కనిపిస్తోంది.  వీరిద్దరి కాంబినేషన్ లో  సీన్స్ అంటే.. ఇక థియేటర్స్ లో నవ్వులే నవ్వులు అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇప్పటికే వెంకీతో బుల్లిరాజు కామెడీని తెగ ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్.. ఇప్పుడు మెగాస్టార్ తో ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

bulli raju- megastar
bulli raju- megastar

వచ్చే ఏడాది సంక్రాంతి

అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఇందులో చిరంజీవి తన సొంత పేరు 'శంకర్ వరప్రసాద్' పాత్రలో కనిపించబోతున్నారు.  ‘గ్యాంగ్‌లీడర్’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’ లో కనిపించిన చిరంజీవిని మళ్ళీ  ఈ సినిమాలో చూడబోతున్నట్లు డైరెక్టర్ అనిల్ తెలిపారు. లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ జోడీగా కనిపించనుంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకుంటోంది. 

Also Read:Mogali Rekulu: మొగలిరేకులు ఆపేయడానికి కారణం నేనే!.. అసలు విషయం బయటపెట్టిన RK నాయుడు!

Advertisment
Advertisment
తాజా కథనాలు