/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-62-jpg.webp)
HBD Brahmanandam
HBD Brahmanandam: ఆయన పేరు వినగానే మొహం పై చిరు నవ్వు వస్తుంది. సౌత్ సినిమాల్లో ఇప్పటివరకు ఎంతో మంది హాస్య నటులు వచ్చారు, వెళ్లారు.. కానీ ఆయన మాత్రం చిరకాలం గుర్తుండిపోయే హాస్యాన్ని అందించారు. తెలుగు సినిమాలో చరిత్రలో ఆయన కామెడీ లేని సినిమాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. సినిమాలో ఆయన ఉన్నారంటే ప్రేక్షకులకు కడుపుబ్బా నవ్వులే. సామాన్య లెక్చరర్ స్థాయి నుంచి వరల్డ్ రికార్డ్ నటుడిగా ఎదిగిన కామెడీ కింగ్ బ్రహ్మానందం పుట్టిన రోజు నేడు.
గిన్నీస్ వరల్డ్ రికార్డు..
దాదాపు 1250 సినిమాలకు పైగా చేసిన నటుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. సినిమాతో సంబంధం లేకుండా తన పాత్రతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకోగల మహా నటుడు బ్రహ్మానందం. స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ ఆయనది. 35 ఏళ్ళ కెరీర్‌లోనే 6 నంది అవార్డులతో పాటు.. ఓ ఫిల్మ్ ఫేర్,మూడు సైమా అవార్డులు సొంతం చేసుకున్నారు. ఫోర్త్ హయ్యస్ట్ సివిలియం అవార్డు పద్మ శ్రీ కూడా ఆయనను వరించింది. బ్రహ్మానందం 1987లో సినిమాల ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
గాడ్ ఆఫ్ మీమ్స్..
ప్రస్తుతం బ్రహ్మానందం సినిమాల్లో కనిపించకపోయిన.. సోషల్ మీడియాలో మీమ్స్ రూపంలో ఆయన నవ్వులు ఇంకా ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎమోజీలా మారిపోయారు. మీమ్స్ లో ఆయన మొహం, ఎక్సప్రెషన్స్ చాలు కడుపుబ్బా నవ్వేస్తారు. సోషల్ మీడియాలో బ్రహ్మానందం స్టిల్, ఎక్సప్రెషన్ వాడని మీమర్స్ ఉండరు. అందుకే ఆయనను గాడ్ ఆఫ్ మీమ్స్. బ్రహ్మానందం ఎమోజీలతో రోజూ సోషల్ మీడియాలో వేలలో మీమ్స్ కనిపిస్తుంటాయి. వాటిని చూసినప్పడుదలా జనం ఒక్కసారి ఆ వింటేజ్ బ్రహ్మీని గుర్తుచేసుకొని కడుపుబ్బా నవ్వుతారు. కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం సినిమాల్లో నటించినా, నటించకపోయిన తెలుగు వారి మనసుల్లో, నవ్వుల్లో ఎప్పుడూ ఉంటారు.
Also Read: స్వలింగ వివాహాలకు అధికారిక గుర్తింపు ...ఆగ్నేసియాలో మొదటి దేశంగా థాయిలాండ్!