/rtv/media/media_files/1GbFGUTyq0Gqe5rPjgUW.jpg)
రీసెంట్ గా 'గోట్' మూవీతో ప్రేక్షకులను పలకరించిన కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్.. తన చివరి సినిమాను హెచ్. వినోద్ దర్శకత్వంలో చేయనున్నారు. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. 'Thalapathy 69' అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చారు.
విలన్ గా బాబీ డియోల్..
ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా భాగం కానున్నాడు. ఈ మేరకు 'Thalapathy 69' చిత్రంలో బాబీ డియోల్‌కు వెల్‌కమ్ చెబుతూ ఇందులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నట్టు ప్రకటించారు. సినిమాలో ఆయన విలన్ రోల్ ప్లే చేస్తున్నట్లు తెలుస్తోంది. 'యానిమల్' తో విలన్ గా లాంచ్ అయినా ఆయన.. ఇప్పటికే కంగువ, NBK 109 సినిమాల్లో ప్రతి నాయకుడిగా కనిపించనున్నారు.
Also Read : నాని కోసం రంగంలోకి పాన్ ఇండియా బ్యూటీ..
100% official now, Super happy & excited to announce that @thedeol joins #Thalapathy69 cast 🔥#Thalapathy69CastReveal#Thalapathy @actorvijay sir #HVinoth @anirudhofficial @Jagadishbliss @LohithNK01 pic.twitter.com/KKCfaQZtON
— KVN Productions (@KvnProductions) October 1, 2024
ఇప్పుడు 'Thalapathy 69' మూవీలోనూ అదే తరహా పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా విజయ్ లాస్ట్ సినిమాలో బాబీ డియోల్ కూడా భాగం అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాగా ఈ సినిమాలో విజయ్ సరసన ప్రేమలు బ్యూటీ మమితా బైజు హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి జగదీశ్ పళనిస్వామి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.