Ramayana: 'రామాయణ 'ప్రాజెక్ట్ పై మరో అప్డేట్.. .. నిర్మాత వీడియో వైరల్!

నితీష్ తివారి దర్శత్వంలో సాయి పల్లవి, రణబీర్ కపూర్ సీతారాములుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్  'రామాయణ'. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమా బడ్జెట్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాయి. 

New Update

Ramayana: నితీష్ తివారి దర్శత్వంలో  అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ప్రాజెక్ట్  'రామాయణ'  ప్రాజెక్ట్ పై రోజురోజుకూ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమా బడ్జెట్ గురించి చేసిన వ్యాఖ్యలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాయి.  ఏకంగా రూ. 4000 కోట్లతో దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పి  ఆశ్చర్యపరిచారు. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ.. ఇంత భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కలేదని.. 'రామాయణ' చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఏ భారతీయ సినిమా కూడా ఈ ప్రాజెక్ట్ దరిదాపుల్లోకి కూడా రాలేదని తెలిపారు. తరలు మారినా, యుగాలు మారినా రామాయణం ఎప్పటికీ గొప్ప ఇతిహాసమే! అందుకే ప్రపంచమంతా దీనిని చూడాలనే లక్ష్యంతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలిపారు నిర్మాత నమిత్.  'రామాయణం' సినిమాతో ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందని అన్నారు.  

Also Read: Kota Srinivasa Rao: ఆ సూపర్ హిట్ పాట పాడింది 'కోట' నే.. ఈ విషయం మీకు తెలుసా?

Advertisment
Advertisment
తాజా కథనాలు