/rtv/media/media_files/2025/02/02/sOsRlS6Alf6GDSK8L5OB.jpg)
Best Camera Smartphones Under Rs 20,000 like vivo, samsung, motorola, iqoo
అతి తక్కువ ధరలో అధునాతన ఫీచర్ల గల సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన అవకాశం. Samsung, iQOO, Vivo వంటి బ్రాండ్ల నుంచి ఆకట్టుకునే కెమెరా సామర్థ్యాలను కలిగి ఉన్న రూ.20,000 లోపు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.
Moto G85
Moto G85 5G ఫోన్ కెమెరా పరంగా అద్భుతమైనది. ఇది OIS, EISతో 50MP సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్ ను కలిగి ఉంది. అలాగే 8MP అల్ట్రావైడ్ లెన్స్‌ను అందిస్తోంది. అలాగే ఫోన్ ముందు వైపు 30fps వద్ద 1080p వరకు వీడియో రికార్డింగ్‌కు మద్దతుతో 16MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది రూ.17,999 ప్రారంభ ధరతో ప్రారంభించబడింది.
iQOO Z9
iQOO Z9 స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఇందులో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్ ల కోసం 16MP సెల్ఫీ కెమెరాను అందించారు. దీని 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ రూ.19,999 నుండి ప్రారంభించబడింది.
CMF phone 1
CMF ఫోన్ 1 స్మార్ట్ ఫోన్ గతేడాది లాంచ్ అయింది. ఇది కెమెరా పరంగా అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో 50MP సోనీ IMX882 ప్రధాన కెమెరా, 2MP పోర్ట్రెయిట్ కెమెరాను అమర్చారు. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాలింగ్ ల కోసం 16MP ఫ్రంట్-ఫేసింగ్ సెన్సార్ కలిగి ఉంది. ఇక దీని ధర విషయానికొస్తే ఇది కేవలం రూ. 15,999 ధరకే అందుబాటులో ఉంది.
Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
Vivo T3 5G
వివో అదిరిపోయే ఫొటోలకు పెట్టింది పేరు. ఇందులో Vivo T3 5G స్మార్ట్ ఫోన్ నుంచి తీసిన ఫొటోలు పిచ్చ హైలైట్ గా నిలుస్తున్నాయి. ఇందులో OISతో 50MP ప్రైమరీ సోనీ IMX882 కెమెరా, 2MP బోకె లెన్స్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. ముందు భాగంలో 16MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. దీని ప్రారంభ ధర రూ. 19,999గా కంపెనీ నిర్ణయించింది.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Samsung Galaxy M35 5G
సామ్ సంగ్ గెలాక్సీ ఎం35 5జీ స్మార్ట్ ఫోన్ వెనుక ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉంది. అందులో 50MP ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్-యాంగిల్ కెమెరా, 2MP మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 13MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. దీని ధరను రూ. 19,999 గా కంపెనీ నిర్ణయించింది.
అందువల్ల రూ.20 వేల లోపు ది బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ ను కొనుక్కోవాలనుకుంటే ఇదే సరైన అవకాశం అని చెప్పాలి. వీటిని ఆన్ లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు.