Taapsee Pannu: చెల్లి కోసం తాప్సీ ఏం చేసిందంటే..! వైరలవుతున్న ఫోటోలు

బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను ముంబై గోరేగావ్ వెస్ట్‌లో రూ.4.33 కోట్ల విలువైన లగ్జరీ ఫ్లాట్‌ను తన సోదరి షగున్ కోసం కొనుగోలు చేశారు. ఇది తాప్సీ చెల్లి కోసం ఇచ్చిన ప్రత్యేక గిఫ్ట్. ఈ ఇంటి రిజిస్ట్రేషన్ వివరాలు IGR పోర్టల్‌లో నమోదయ్యాయి.

New Update
Taapsee

Taapsee

Taapsee Pannu: బాలీవుడ్‌(Bollywood) నటి తాప్సీ పన్ను తన సోదరి షగున్ పన్నుతో కలిసి ముంబై నగరంలోని గోరేగావ్ వెస్ట్ ప్రాంతంలో ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ఈ ప్రీమియం ఫ్లాట్‌ ధర రూ.4.33 కోట్లు అని తెలుస్తోంది. ఈ లావాదేవీ వివరాలు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) పోర్టల్‌ ద్వారా వెల్లడయ్యాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా వారు సుమారు రూ.21.65 లక్షల స్టాంప్ డ్యూటీతో పాటు అదనంగా రూ.30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు.

Also Read: ఇలా ఉన్నారేంట్రా అయ్యా..! 'యమదొంగ' రీ-రిలీజ్ లో అలీ గెటప్ రీ క్రియేట్ చేసి రచ్చ రచ్చ..

ఈ అపార్ట్‌మెంట్‌ “ఇంపీరియల్ హైట్స్” అనే రెడీ-టు-మూవ్ ప్రాజెక్టులో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చదరపు అడుగుకు సగటు ధర సుమారు రూ.32,170గా ఉండటం విశేషం. గోరేగావ్ వెస్ట్ ఇప్పుడు ముంబై నగరంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న, లగ్జరీ నివాస ప్రాంతాల్లో ఒకటి.

Also Read: 'రెట్రో' లెక్కలివే.. సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్..!

సోషల్ మీడియాలో వైరల్

ఇప్పటికే తాప్సీకి ముంబైలో ఒక ప్రత్యేకమైన ఇల్లు ఉంది. పాత పంజాబీ శైలిలో నిర్మించిన ఆ ఇంటిని, ఆమె సోదరి షగున్ స్వతహాగా ఒక ప్రొఫెషనల్ వెడ్డింగ్ ప్లానర్ కాబట్టి ఇంటిని అందంగా అలంకరించింది. ఆ ఇంటికి సంబంధించిన డెకరేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయ్యాయి.

Also Read: హరి హర వీరమల్లు 3rd సింగిల్ వచ్చేస్తోంది..

తాజాగా కొనుగోలు చేసిన ఇంటికి ఒక స్టోరీ ఉంది. తాప్సీ భర్త మథియాస్ బోతో కలిసి తన పాత ఇంటిలోనే నివసిస్తుండగా, ఈ కొత్త ఇంటిని ఆమె ప్రత్యేకంగా తన సోదరి షగున్ కోసం తీసుకున్నట్లు సమాచారం. గత సంవత్సరం తాప్సీ పెళ్లి తర్వాత, ఆమె సోదరికి ఒక సొంత నివాసం ఉండాలనే ఆలోచనతో ఈ ఇల్లు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ లగ్జరీ ఫ్లాట్‌ ను తన చెల్లి కి గిఫ్ట్ గా ఇచ్చి చెల్లి పై తనకున్న ప్రేమను చాటుకుంది తాప్సీ.

Also Read: 'శుభం' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న సమంత.. చీర లుక్‌ అదిరింది! (ఫోటోలు)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు