Kalki 2: దీపికా అవుట్.. అలియా ఇన్..? ‘కల్కి 2’పై బాలీవుడ్‌లో హాట్ టాపిక్!

‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో దీపికా స్థానంలో ‘సుమతి’ పాత్రకు కొత్త నటి కోసం మొదట సాయి పల్లవి పేరు వినిపించినా, తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ ఈ పాత్రలో మెరవనుందని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రావొచ్చని అనుకుంటున్నారు.

New Update
Kalki 2

Kalki 2

Kalki 2: పాన్ ఇండియా స్థాయిలో ఎంతో భారీగా తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ సినిమా మొదటి భాగం ప్రేక్షకుల నుండి మంచి స్పందన అందుకుంది. ఇందులో దీపికా పదుకొణే(Deepika Padukone) పాత్ర చాలా కీలకమైనదిగా ఉండగా, ఇటీవల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై చిత్రబృందం అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసారు, దీపికా చిత్రం నుంచి తప్పుకోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: కెరీర్ మీద ఫోకస్ పెట్టిన పికిల్స్ పాప.. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ?

‘కల్కి’లో సుమతి (Sum-80) పాత్ర కథలో ముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ పాత్రలో ముందుగా దీపికాను తీసుకున్నప్పటికీ, ఆమె చిత్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత, ఆ స్థానం లో ఎవరు వస్తారో అన్న దానిపై చాలా ఊహాగానాలు మొదలయ్యాయి. కొద్ది రోజులుగా సాయి పల్లవి పేరు బాగా వినిపించింది. ఆమె నేచురల్ పెర్ఫార్మెన్స్, ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆమె ఈ పాత్రకు సరిపోయే నటి అని చెప్పుకుంటున్నారు.

Also Read: విజయ్ దేవరకొండ - కీర్తి సురేష్ జోడీ కన్‌ఫర్మ్.. పూజా కార్యక్రమం త్వరలో!

Alia Bhatt in Kalki 2

కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ పాత్రలో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్(Alia Bhatt) మెరవనుందని బీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. అలియా ఇప్పటికే జాతీయ అవార్డు గెలిచిన నటి కావడం, అలాగే ఆమెను ‘కల్కి 2’ దర్శకుడు నాగ్ అశ్విన్ మరో ప్రాజెక్ట్ కోసం సంప్రదించడంతో, అదే అవకాశాన్ని ఈ సినిమాకి మార్చినట్టు తెలుస్తోంది.

ఈ సమాచారం సినీ వర్గాల్లో హల్చల్ చేస్తున్నప్పటికీ, ఇప్పటి వరకు చిత్రబృందం దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. కానీ అలియా పేరు తెరపైకి రావడం వలన ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

Also Read: వైరల్ అవుతోన్న 'OG' హీరోయిన్ ప్రియాంక మోహన్ AI ఫోటోలు..

‘కల్కి 2898 AD’ ఒక వినూత్నమైన మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ సినిమా. ఈ సినిమా కథ కురుక్షేత్ర యుద్ధం నుంచి మొదలవుతుంది. ఆ సమయంలో శ్రీకృష్ణుడు, అశ్వత్థాముని విశ్ణువు యొక్క చివరి అవతారమైన కాల్కిని రక్షించమని ఆదేశిస్తాడు. దీపికా పాత్ర గర్భవతిగా ఉండి, కాల్కిని తన గర్భంలో మోస్తుంది. ఈ బిడ్డ భవిష్యత్‌ను మార్చే శక్తి కలిగి ఉంటాడు. ఈ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్లు కీలక పాత్రల్లో ఉన్నారు. ‘కల్కి 2’ షూటింగ్ 2026లో ప్రారంభం కానుంది.

Also Read: హాట్ అండ్ క్యూట్ లుక్స్‌లో మెహ్రీన్.. 

ఇప్పుడు అందరి దృష్టి కల్కి 2లో ‘సుమతి’ పాత్రను ఎవరు పోషించబోతున్నారనే విషయంపై ఉంది. అలియా భట్ పేరు బయటకు రావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎదురుచూపులు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన వచ్చేదాకా ఈ టాపిక్ బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గానే ఉండనుంది!

Advertisment
తాజా కథనాలు