Bigg Boss Telugu : 'బిగ్ బాస్ -8' కు రికార్డ్ బ్రేకింగ్ టీఆర్పీ..

'బిగ్ బాస్' సీజన్ 8 లాంచింగ్‌ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. ​ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేసిన మొదటి సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌కు16.18, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌ కు 15.05 రేటింగ్‌ వచ్చింది.

New Update
big boss

Bigg Boss Telugu Season 8 :

తెలుగు బుల్లితెర టాప్ రియాలిటీ షోగా పేరొందిన 'బిగ్ బాస్' కు ఆడియన్స్ లో ఉన్న క్రేజే వేరు.ప్రతీ సీజన్ కు ఈ షోను చూసే వారి సంఖ్య ఎక్కువవుతూ వస్తోంది. ఇప్పటిదాకా తెలుగులో ఏడు సీజన్స్ ను పూర్తి చేసుకొని.. రీసెంట్ గానే ఎనిమిదో సీజన్ మొదలు పెట్టుకుంది బిగ్ బాస్. ఈసారి హౌస్ లో నాలకు పెద్దగా తెలియని ముఖాలను తీసుకొచ్చినా సరే కొద్దిరోజుల్లోనే వారు అందరికీ సుపరిచితులైపోతారు.

ఈసారి పెద్దగా అంచనాలు, హడావుడి లేకుండానే బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 1న ప్రసారమైన ఈ షో లాంచింగ్‌ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్పీ వచ్చింది. తెలుగు బిగ్‌బాస్‌ చరిత్రలో ఇదే అత్యధికం కావడం విశేషం. జూనియర్‌​ ఎన్టీఆర్‌ హోస్ట్‌ చేసిన మొదటి సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌కు 16.18 టీఆర్పీ వచ్చింది. నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌ ప్రారంభ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్‌ వచ్చింది.

మూడో సీజన్‌ నుంచి నాగార్జున హోస్ట్‌గా బాధ్యతలు చేపట్టారు. అలా మూడో సీజన్‌ లాంచింగ్‌ ఎపిసోడ్‌కు 17.92, నాలుగో సీజన్‌కు 18.50, ఐదో సీజన్‌కు 18, ఆరో సీజన్‌కు అన్నింటికంటే తక్కువగా 8.86 రేటింగ్‌ వచ్చింది. ఏదేమైనా బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కు గత సీజన్స్ అన్నిటికంటే ఎక్కువ టీఆర్పీ రావడం విశేషమనే చెప్పాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు