Bigg Boss Telugu 9: బిగ్ బాస్ - 9 షో 2.0.. ఆరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. ఎవరెవరంటే?

త్వరలో బిగ్ బాస్ 9 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం. అయితే వీరి వల్ల హౌస్ హర్మోన్ మారుతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఆరు లేదా ఏడుగురు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

New Update
Bigg boss telugu 9

Bigg boss telugu 9

తెలుగు రియాలటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ సీజన్‌లో మొత్తం 9 మంది సెలబ్రిటీలు, 6గురు కామనర్స్ హౌస్‌లోకి వెళ్లారు. ఇప్పటికే రెండు వారాలు పూర్తి అయ్యింది. మొదటి వారం కొరియోగ్రాఫర్  శ్రష్ఠి వర్మ వెళ్లిపోగా, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ మరో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో బిగ్ బాస్ 9 హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం. అయితే వీరి వల్ల హౌస్ హర్మోన్ మారుతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఆరు లేదా ఏడుగురు బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కొందరి పేర్లు నెట్టింట వినిపిస్తున్నాయి. వారిలో ముఖ్యంగా నటి సుహాసిని, బుల్లితెర నటి కావ్యశ్రీ, అలేఖ్య, చిట్టి పికిల్స్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు గేమ్ ప్లాన్‌ను మార్చి, ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తాయని బిగ్ బాస్ భావిస్తోంది. మరి వీరు షోని ఎలా మారుస్తారనే విషయం చూడాలి. అయితే ఈ నాలుగో వారంలో వైల్డ్ కార్డుల ఎంట్రీ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి: OG: ఓజీ ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ మాస్ ఎంట్రీ.. వైరలవుతున్న ఫొటోలు

వినోదం కోసమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ..

గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అంత రసవత్తరంగా అయితే సాగడం లేదు. ఈ సీజన్‌లో రణరంగాలు ఎక్కువగా ఉంటాయని హోస్ట్ నాగార్జున చెప్పారు. కానీ ఆశించినంత స్థాయిలో అయితే ఈ సీజన్ ప్రేక్షకులను అలరించడం లేదు. ఈ సీజన్‌లో ఇమ్మాన్యూయెల్ కాస్త కామెడీ చేస్తున్నాడు. ఇక సంజనా హౌస్‌ను కాస్త యాక్టివ్‌గా ఉంచడం కోసం ట్రై చేస్తోంది. ప్రేక్షకులు బిగ్ బాస్ చూడటానికి కాస్త ఇష్టపడుతున్నారంటే దానికి ముఖ్య కారణం సంజనా. ఈమె హౌస్‌లో ఉన్నందరికి కూడా చుక్కలు చూపిస్తోంది. మొదటి రెండు రోజులు సైలెంట్‌గా ఉన్న సంజనా ఇప్పుడు ఆటలో అదరగొడుతుందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి మున్ముందు ఈ సీజన్ ఎలా ఉంటుందో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వల్ల ఎలా మారబోతుందో చూడాలి. 

ఇది కూడా చూడండి: Radhika: సీనియర్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం

#celebrities #bigg-boss-wild-card-entry #bigg boss telugu 9
Advertisment
తాజా కథనాలు