బిగ్ బాస్ హౌస్ లోకి మెకానిక్ రాకీ.. కంటెస్టెంట్లకు భారీ ట్విస్ట్! బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో 'మెకానిక్ రాకీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హీరో విశ్వక్ సేన్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేయడం చూపించారు. విశ్వక్ కంటెస్టెంట్స్ తో కలిసి ఫన్నీ స్కిట్ లో పాల్గొని నవ్వులు పూయించారు. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి. By Archana 21 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update Vishwak Sen Bigg boss షేర్ చేయండి Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8.. షో ప్రారంభంలో నాగార్జున చెప్పినట్లుగానే రకరకాల ట్విస్టులు, టర్న్ లతో సాగుతోంది. ఇప్పటికే 10 వారాలు పూర్తయిన ఈ షోలో యష్మీ, నిఖిల్, రోహిణీ, పృథ్వీ, అవినాష్, గౌతమ్, విష్ణుప్రియా, టేస్టీ తేజ, ప్రేరణ, నబీల్ టాప్ 10 కంటెస్టెంట్స్ గా మిగిలారు. అయితే తాజాగా బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశాడు. ఈ ప్రోమోలో హీరో విశ్వక్ బిగ్ బాస్ హౌస్ లోకి రావడం చూపించారు. విశ్వక్ 'మెకానిక్ రాకీ' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా హౌస్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: షమీ-మంజ్రేకర్ మధ్య ఐపీఎల్ వివాదం.. దాన్ని దాచుకోమంటూ కౌంటర్స్! విశ్వక్ ఫన్నీ టాస్క్ హౌస్ లోకి వచ్చిన విశ్వక్ కంటెస్టెంట్లకు ఒక ట్విస్ట్ ఇస్తాడు. మీ కిచెన్ టైం పెరగాలంటే ఎంటర్ టైన్ చేయాలని చెప్తాడు. దీంతో అవినాష్, రోహిణీ విశ్వక్ తో కలిసి ఒక ఫన్నీ స్కిట్ చేస్తారు. ఇందులో విశ్వక్, అవినాష్, రోహిణీ తమ కామెడీ టైమింగ్ తో నవ్వులు పూయించారు. మెకానిక్ రాకీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది ఇలా ఉంటే ఈ వారం పృథ్వీ, యష్మీ, ప్రేరణ, నిఖిల్, నబీల్ నామినేషన్స్ లో ఉన్నారు. సోషల్ మీడియా టాక్ ప్రకారం యష్మీ ఈ వారం ఎలిమినేట్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిఖిల్ విషయంలో యష్మీ ఫిల్ప్ అయిన విధానం ఆమె పై నెగిటివిటీ రావడానికి కారణమైందని. అందుకే ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉందని అనుకుంటున్నారు. అంతేకాదు డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉందని టాక్. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ వెళ్లే చాన్స్ ఉండొచ్చని అనుకుంటున్నారు. Also Read : కలిసి ఉండలేం, మాకు విడాకులు ఇచ్చేయండి.. కోర్టులో ధనుష్, ఐశ్వర్య Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! #big boss 8 telugu #vishwak-sen #bigg-boss-promo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి