బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్, కావ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే బిగ్ బాస్ తర్వాత నిఖిల్ ఇంకా ఏ సీరియల్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అయితే కావ్య ఇటీవల నటిస్తున్న చిన్ని అనే కొత్త సీరియల్ ప్రొమోలో నిఖిల్ కనిపించాడు. ఈ సీరియల్‌కి సంబంధించిన ప్రోమోను టీం విడుదల చేసింది. ఈ సీరియల్‌లోకి నిఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. గేమ్ స్టార్ట్ నౌ అంటూ కావ్యతో చేతులు కలిపాడు. నిఖిల్ ప్లేస్‌లో ఇంకెవరు వచ్చినా కూడా పెద్ద షాకింగ్ అనిపించదు. కానీ నిఖిల్ రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అసలు అవధుల్లేవు.
ఇది కూడా చూడండి: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారికి సొంత నిర్ణయాలు నష్టాన్ని తెచ్చిపెడతాయి.. జాగ్రత్త!
Here is the Special Promo of Chinni. Watch it Mon-Sat at 7 pm only on #StarMaa! #Chinnipic.twitter.com/4sJ43N9F89
— Starmaa (@StarMaa) March 8, 2025
ఇది కూడా చూడండి: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
సడెన్‌గా చిన్ని సీరియల్‌కి ఎంట్రీ ఇవ్వడంతో..
నిఖిల్, కావ్య జోడికి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే సీరియల్‌లో నిఖిల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్లిద్దరూ గతంలో రిలేషన్‌లో ఉన్నారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. సోషల్ మీడియాలో కూడా ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో వీరిద్దరికి బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Trolls on Jr NTR: ఎన్టీఆర్ యాడ్ పై గోరంగా ట్రోలింగ్..! వీడియో చూశారా?
బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాత నిఖిల్, కావ్య టాపిక్ చాలా సార్లు వచ్చింది. అసలేం జరిగిందని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా ఇద్దరు ఒకే సీరియల్‌లో నటిస్తున్నారంటే ఫ్యాన్స్‌కి పండగే.
ఇది కూడా చూడండి: TG News: మహిళలపై సీఎం రేవంత్ వరాల జల్లు.. ఇందిరా మహిళాశక్తి మిషన్-2025 పాలసీ ప్రకటన!