/rtv/media/media_files/2025/09/24/og-movie-2025-09-24-15-37-45.jpg)
OG OTT: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన పవర్ స్టార్ 'ఓజీ' వైబ్స్ కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బాయ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో విడుదలైంది. అభిమానుల అంచనాలకు తగ్గట్లే సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటోంది. ఈరోజు రాత్రి ప్రీమియర్ షోల నుంచే సంబరాలు షురూ చేశారు పవన్ ఫ్యాన్స్. థియేటర్ల ముందు బాణా సంచా కాలుస్తూ, రివ్యూలు చెబుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆయనను అభిమానులకు ఎలా చూపించాలో బాగా అర్థం చేసుకున్నాడు డైరెక్టర్ సుజీత్. కథ రొటీన్ అయినప్పటికీ.. తన డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్, స్క్రీన్ ప్లేతో ఫ్యాన్స్ కి ఫుల్ కిక్కిచ్చాడు. సినిమాలో పవర్ స్టార్ స్టైల్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ ఫుల్ మీల్స్ లా ఉన్నాయి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతీ సీన్ ని మరింత ఎలివేట్ చేసింది. మొత్తానికి బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకుంది 'ఓజీ' .
Saw countless emotional smiles, happy tears & wild celebrations from fans today 🔥#OG isn’t just stylish, it’s one of the most technically brilliant films in recent times. Absolute treat to watch 👏
— Nayini Anurag Reddy (@NAR_Handle) September 24, 2025
Congrats @PawanKalyan garu, @Sujeethsign, @MusicThaman & team#TheyCallHimOGpic.twitter.com/wOxTV8s6E4
ఓటీటీ డీల్ ఫిక్స్
థియేటర్స్ లో విడుదలై ఒక్కరోజు కూడా కాకముందే.. అప్పుడే 'ఓజీ' ఓటీటీ డీల్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'ఓజీ' డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ. 92 కోట్లు ఓజీ రైట్స్ అమ్ముడైనట్లు సినీ వర్గాల్లో టాక్. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఇది అతి పెద్ద ఓటీటీ డీల్ అని తెలుస్తోంది. సాధారణంగా.. థియేటర్లలో విడుదలైన తర్వాత 4 నుంచి 8 వారాల మధ్య ఓటీటీలోకి వస్తుంది. లేదా అంతకంటే ముందే దీపావళి కానుకగా ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. స్ట్రీమింగ్ తేదీ ఎప్పుడనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు.
బిగ్గెస్ట్ ఓపెనింగ్స్
ఇప్పటికే ప్రీమియర్ షోలు, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓజీ రూ. 72 కోట్లు వసూలు చేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ఓవర్ సీస్ నుంచి 2 మిలియన్ డాలర్లు కలెక్ట్ చేసినట్లు టాక్. దీంతో తొలిరోజే రూ.100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది పవన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కాబోతుంది.