BIGG BOSS 9 TELUGU: రచ్చ రచ్చే.. బిగ్ బాస్ లోకి బాలయ్య ''లక్స్ పాప''! ఎమోషనల్ గా AV!

బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. సీజన్ 9 లో ఫస్ట్ కంటెస్టెంట్ గా 'ముద్ద మందారం'  సీరియల్ నటి తనూజ ఎంట్రీ ఇచ్చింది. సెకండ్ కంటెస్టెంట్ గా 'లక్స్ పాప' సాంగ్ తో కుర్రాళ్లను ఫిదా చేసిన ఆశ షైనీ హౌజ్ లో అడుగుపెట్టింది.

New Update

Bigg Boss Telugu 9:   బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రారంభమైంది. రాక్షసుడు సినిమాలోని ''సోనియా.. సోనియా'' పాటతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ అదిరిపోయింది. గత సీజన్స్ మాదిరిగా కాకుండా ఈసారి ''డబుల్ హౌజ్ డబుల్ డోస్''.. అంటూ కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచారు మేకర్స్. సెలబ్రెటీలతో పాటు సామాన్యులకు కూడా ఈసారి బిగ్ బాస్ హౌజ్ లో అడుగుపెట్టేందుకు అవకాశం కల్పించారు. 'అగ్నిపరీక్ష' అనే ఒక ప్రీషో ప్రక్రియ  ద్వారా కామనర్స్ ఎంపిక చేయనున్నారు. మొత్తానికి సీజన్ 9 సెలబ్రెటీస్ వర్సెస్ కామనర్స్ గా రసవత్తరంగా  ఉండబోతుంది. 

సెలబ్రెటీ కంటెస్టెంట్ లిస్ట్ 

ఇక ప్రేక్షకులు  ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కంటెస్టెంట్స్ ఎవరో కూడా తెలిసిపోయింది.  సీజన్ 9  ఫస్ట్ కంటెస్టెంట్ గా  'ముద్ద మందారం' ఫేమ్  నటి తనూజ ఎంట్రీ ఇచ్చింది. 

బాలయ్య 'లక్స్ పాప'

సెకండ్ కంటెస్టెంట్ గా బాలయ్య  'నరసింహ నాయుడు' సినిమాలో 'లక్స్ పాప' సాంగ్ తో కుర్రాళ్లను ఫిదా చేసిన ఆశ షైనీ హౌజ్ లోకి అడుగుపెట్టింది. ఒక ఎమోషనల్ ఏవీ తో ఆశ తన జర్నీని ఆడియన్స్ కి పరిచయం చేసింది.  

ఆ తర్వాత 3rd సెలబ్రెటీ కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ ఇమ్మాన్యుయేల్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు. జబర్దస్త్ లో తనదైన కామెడీతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా తన వినోదాలను పంచేందుకు సిద్ధమయ్యారు. 

సెలబ్రెటీస్ నుంచి 4th కంటెస్టెంట్ గా లేడీ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఇంట్లోకి అడుగుపెట్టారు. ఢీ షోతో కంటెస్టెంట్ గా  కెరీర్ స్టార్ చేసిన శ్రేష్టి వర్మ.. ఆ తర్వాత తన టాలెంట్ తో సినిమా కొరియోగ్రాఫర్ గా ఎదిగింది. రీసెంట్ గా  పుష్ప 2 సినిమాలో 'సూసేకి అగ్గిరవ్వ'  సాంగ్  శ్రేష్టి కొరియోగ్రఫీ చేసింది. 

5th సెలబ్రెటీ కంటెస్టెంట్ గా ప్రముఖ సీరియల్, సినిమా ఆర్టిస్ట్ భరణి శంకర్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.  'బాహుబలి', 'పరమ వీర చక్ర', 'ఆవిరి' వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.  

6th సెలబ్రెటీ కంటెస్టెంట్ గా టీవీ నటి రీతూ చౌదరీ ఎంట్రీ ఇచ్చింది. రీతూ బుల్లితెర పై పలు టీవీ షోలు, సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. 

7th కటెస్టెంట్ గా 'బుజ్జిగాడు' హీరోయిన్ సంజన గల్రాని హౌజ్ లోకి వెళ్ళింది. 

8th సెలబ్రెటీ కంటెస్టెంట్ గా యూట్యూబ్ స్టార్, సింగర్ రాము రాథోడ్ బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. రాము పాడి , కొరియోగ్రఫీ చేసిన రాను బొంబైకి రానూ పాట యూట్యూబ్ లో సంచలనం సృష్టించింది. 516 మిలియన్ పైగా వ్యూస్ సాధించింది. 

Also Read: BIGG BOSS 9 TELUGU: బిగ్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ లోకి మెగాస్టార్ ఫ్యామిలీ ఫ్రెండ్!

Advertisment
తాజా కథనాలు