/rtv/media/media_files/FiMLlZuSJtTJ9KZtS9m9.jpg)
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఇండియన్ 2' సినిమా రీసెంట్ గావిడుదలైన విషయం తెలిసిందే. జులై 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అప్పట్లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీలో కమల్ హాసన్ తో పాటూ సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, SJ సూర్య, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు.
#Indian3 - May skip theatrical release. And, this is what happens when you use political & monetary power to put pressure on a director to finish a film & that too in two parts. pic.twitter.com/x0CB3ZITZ8
— Aakashavaani (@TheAakashavaani) October 3, 2024
లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మించగా.. సినిమా అట్టర్ ప్లాప్ అవ్వడంతో నిర్మాతలకు భారీగా నష్టాలొచ్చాయి. అయితే ఈ సినిమాకు పార్ట్-3 కూడా రాబోతుంది. 'భారతీయుడు 2' క్లైమాక్స్ లోనే పార్ట్-3 కి సంబంధించి కొన్ని సీన్స్ చూపించారు. అందులో కాజల్ అగర్వాల్ కూడా కనిపించనుంది. ఇదిలా ఉంటే 'భారతీయుడు 2' డిజాస్టర్ అవ్వడంతో పార్ట్ - 3 విషయంలో మేకర్స్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.
BUZZ 📢
— SillakiMovies (@sillakimovies) October 3, 2024
• #Indian3 Only On Netflix JAN 2025 🔥#KamalHaasan #KajalAggarwal pic.twitter.com/KTtQI3p9Bh
Also Read : కేథరిన్ లీడ్ రోల్ లో పాన్ ఇండియా మూవీ.. గ్రాండ్ గా టైటిల్ లాంచ్
డైరెక్ట్ ఓటీటీలోనే..
'భారతీయుడు 3' సినిమాను థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం నిర్మాణసంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతోందని.. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు షేర్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై అటు నిర్మాణసంస్థకానీ, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కానీ ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.