Sreeleela: యంగ్ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రాణిస్తోంది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడిపేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ భాషల్లో కలిపి 3కు పైగా ప్రాజెక్టులు ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి. అయితే తాజా అప్డేట్ ప్రకారం.. అఖిల్ 'లెనిన్' సినిమా నుంచి ఈ ముద్దుగుమ్మ తప్పుకున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చాలా సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయినట్లు తెలుస్తోంది.
శ్రీలీల అవుట్
ప్రస్తుతం శ్రీలీల తెలుగులో పవన్ కళ్యాణ్ "ఉస్తాద్ భగత్ సింగ్", రవితేజ "మాస్ జాతర" అక్కినేని అఖిల్ తో 'లెనిన్' సినిమాలతో పాటు హిందీ, తమిళ ప్రాజెక్టులకు కూడా సైన్ చేసింది. దీనివల్లే "లెనిన్" షూటింగ్ ఇబ్బందులు వస్తున్నాయని, ఆమె కారణంగా షూటింగ్ పలుమార్లు వాయిదా పడిందని అంటున్నారు. అందుకే 'లెనిన్' నుంచి సైడ్ అయినట్లు సమాచారం. ఇప్పటికే అఖిల్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో శ్రీలీల పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపించి ఆకట్టుకుంది.
భాగ్యశ్రీ బోర్సే
అయితే ఈ సినిమాలో శ్రీలీల స్థానాన్ని భర్తీ చేయడానికి మరో యంగ్ బ్యూటీని రంగంలోకి దించుతున్నారట మేకర్స్. ప్రస్తుతం 'కింగ్ డమ్' సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సేను తీసుకోవాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ వార్తలు నిజమా కాదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాలి. భాగ్యశ్రీ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో తన గ్లామర్, నటన తో ఫిదా చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వరుస అవకాశాలు చేజిక్కించుకుంది. ప్రస్తుతం 'కింగ్ డమ్' తో పాటు రామ్ పోతినేనితో 'ర్యాపో' దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తోంది.
Also Read: Miss World 2025: హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అందగత్తెల సందడి.. సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం( వీడియో)