/rtv/media/media_files/2025/07/31/ram-cinema-2025-07-31-17-24-56.jpg)
Bhagyashri Borse: హీరోయిన్లకు సినిమాలు వచ్చేదే తక్కువ. సెలక్టివ్ గా సినిమాలు చేస్తే తప్ప ఇండస్ట్రీలో తట్టుకుని నిలబడటం చాలా కష్టం. పాత్రకు తక్కువ, గ్లామర్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మాత్రం తట్టాబుట్టా సర్ధాల్సిందే. ప్రస్తుతం యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే పరిస్థితి అలాగే ఉంది. పూణేకు చెందిన ఈ బ్యూటీ మాస్ మహారాజ్ రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ సినిమాలో నటించింది. దర్శకుడు హరీష్ శంకర్ ఆమె లుక్స్, నటనతో ఈ చిత్రానికి ఎంపిక చేశారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన విజయం సాధించలేకపోయినా, ఆమె గ్లామర్, పాత్రలో ఉన్న కాస్త నటనకు ప్రశంసలు దక్కాయి. చూడటానికి చాలా గ్లామర్ గా ఉండటంతో అవకాశాలు వెంటవెంటనే వచ్చాయి.
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్ డమ్. ఈ సినిమాపై ఆమె చాలా ఆశలు పెట్టుకుంది. అయితే సినిమాకు మిక్సుడ్ టాక్ రావడం, అమ్మడు పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నట్టు అనిపించింది. రెండు సినిమాల్లో అనుకున్నంతగా గుర్తింపు రాకపోవడంతో ఇప్పుడు భాగ్యశ్రీ హీరో రామ్ సినిమా ఆంధ్రాకింగ్ తాలూకా పైనే ఆశలు పెట్టుకుంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొడితే అమ్ముడుకు మంచి బ్రేక్ వస్తుంది. లేదంటే మాత్రం టాలీవుడ్ నుంచి తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేననే మాటలు వినిపిస్తు్న్నాయి. అసలే తెలుగు సినిమాల్లో సెంటి మెంట్ ఎక్కువ. హిట్ ఇచ్చిన హీరోయిన్ కే అవకాశాలు వస్తాయి. హిట్ లేకపోతే ఎంత నటన, గ్లామర్ ఉన్న అస్సలు పట్టించుకోరు. మరి భాగ్యశ్రీని ఆంధ్రాకింగ్ ఆదుకుంటుందా లేదా అన్నది చూడాలి.
హీరో రామ్ తో డేటింగ్
హీరో రామ్ పోతినేనితో భాగ్యశ్రీ బోర్సే డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ్రా కింగ్ తాలూకా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ డేటింగ్ పుకార్లపై భాగ్యశ్రీ బోర్సే సోషల్ మీడియాలో స్పందించింది. ఆమె తన అభిమానులతో చిట్ చాట్ చేస్తున్నప్పుడు, ఒక నెటిజన్ ఆమె చేతికి ఉన్న ఉంగరం గురించి ఈ రింగ్ ఎవరు తొడిగారని ప్రశ్నించాడు. దానికి భాగ్యశ్రీ, ఈ ఉంగరం నేనే కొనుక్కున్నాను అని సమాధానం ఇచ్చింది. ఈ సమాధానం ద్వారా ఆమె తాను ఎవరితోనూ రిలేషన్‌లో లేనని, సింగిల్‌గా ఉన్నానని పరోక్షంగా స్పష్టం చేసిందని అభిమానులు భావిస్తున్నారు. ఆమె ఈ పుకార్లను చాలా తేలికగా తీసుకుంది.
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా గురించి
పి. మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రామ్ సూర్యకుమార్ అనే టాప్ హీరోకి డై-హార్డ్ అభిమానిగా కనిపించనున్నాడు. కన్నడ స్టార్ ఉపేంద్ర ఒక కీలక పాత్రలో అంటే సూపర్ స్టార్ సూర్యకుమార్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం నుండి మొదటి సింగిల్ నువ్వుంటే చాలే ఇప్పటికే విడుదలైంది. ఈ పాటను అనిరుధ్ రవిచందర్ ఆలపించగా, హీరో రామ్ పోతినేని స్వయంగా ఈ పాటకు లిరిక్స్ అందించడం విశేషం. ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే మంచి స్పందన అందుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదలయ్యే అవకాశం ఉంది. డబుల్ ఇస్మార్ట్ వంటి డిజాస్టర్ తర్వాత రామ్ పోతినేని నుండి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఈ చిత్రం ద్వారా రామ్ సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నారు.