/rtv/media/media_files/2025/09/14/beauty-trailer-2025-09-14-12-08-27.jpg)
Beauty Trailer
Beauty Trailer: కుటుంబ బంధాలు, ప్రేమ, ఆత్మీయత కలసినపుడు జీవితం ఎంత అందంగా మారుతుందో చూపించేందుకు వస్తున్న చిత్రం ‘బ్యూటీ’. తండ్రి, కూతురు మధ్య ఉన్న అనుబంధాన్ని సున్నితంగా మలిచిన ఈ సినిమా, మిడిల్ క్లాస్ భావోద్వేగాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.
Also Read: నా తమ్ముడికి బెస్ట్ విషెస్.. 'మిరాయ్' మూవీపై మంచు విష్ణు ట్వీట్ వైరల్..!
ఈ సినిమాను జీ స్టూడియోస్, మారుతీ టీం ప్రొడక్షన్స్, వానర సెల్యూలాయిడ్ సంయుక్తంగా నిర్మించాయి. జె.ఎస్.ఎస్. వర్ధన్ దర్శకత్వం వహించగా, కథ, స్క్రీన్‌ప్లేను ఆర్.వి. సుబ్రహ్మణ్యం అందించారు. కొత్తదనంతో పాటు భావోద్వేగాలతో నిండిన కథనానికి ఈ కాంబినేషన్ మంచి బలంగా నిలుస్తోంది.
ఈ సినిమాలో హీరోగా అంకిత్ కొయ్య, హీరోయిన్‌గా నీలఖి నటిస్తున్నారు. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమకథ కేవలం రొటీన్ లవ్ స్టోరీగా కాకుండా, కుటుంబ విలువలతో ముడిపడి ఉండటం సినిమాకు ప్రత్యేకత.
Also Read: ఆ ఒక్క విషయంలో 'మిరాయ్' డిస్సపాయింట్ చేసిందట..! ఏంటంటే..?
Naga Chaitanya Launched Beauty Movie Trailer
తాజాగా విడుదలైన ట్రైలర్‌ను యువ హీరో అక్కినేని నాగచైతన్య ఆవిష్కరించారు. ఇందులో ఉన్న కొన్ని డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
“ఎప్పుడైనా నేను నిన్ను కొప్పడితే నన్ను అలా వదిలి వెళ్ళకు..., నిన్ను వదిలేసి వెళ్ళడం అంటే నా ఊపిరి వదిలేసినట్లే...” వంటి డైలాగ్స్ మనసుకు హత్తుకొనేలా ఉన్నాయి. మరోవైపు, “క్యాబ్ డ్రైవర్ అయితే డ్రైవర్‌లా ఉండాలి గానీ కలెక్టర్‌లా ప్రామిస్ చేయొద్దు” అనే డైలాగ్స్ ఆకర్షించాయి.
Also Read: 'మిరాయ్' సినిమాపై RGV మైండ్ బ్లోయింగ్ ట్వీట్! హాలీవుడ్ రేంజ్ లో
టెక్నికల్ టీమ్, మ్యూజిక్
సినిమాకు విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెద్ద ప్లస్‌గా నిలుస్తున్నాయి. శ్రీ సాయి కుమార్ దారా అందించిన సినిమాటోగ్రఫీ బాగుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. ఎస్.బి. ఉద్ధవ్ చేసిన ఎడిటింగ్ కూడా గ్రిప్పింగ్ గా అనిపిస్తోంది. ఈ చిత్రంలో నరేష్, వాసుకి, సోనియా చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వారి పాత్రలు కథకు బలం చేకూరుస్తాయని చిత్రబృందం చెబుతోంది.
Also Read: కనిపించి 'కన్నప్ప'ని.. వినిపించి 'మిరాయ్'ని ప్రభాస్ ఆదుకున్నాడా..?
థియేటర్లలోకి ‘బ్యూటీ’
ఇప్పటికే ట్రైలర్‌తో పాజిటివ్ బజ్ తెచ్చుకున్న ఈ సినిమా, సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉండటంతో, బ్యూటీ సినిమా మంచి విజయం సాదిస్తుందని భావిస్తున్నారు.
Follow Us